Begin typing your search above and press return to search.

మరికొన్నాళ్లకు దేశం అదృశ్యం అవ్వబోతుందట

By:  Tupaki Desk   |   7 March 2023 3:00 PM GMT
మరికొన్నాళ్లకు దేశం అదృశ్యం అవ్వబోతుందట
X
ఒకప్పుడు ఇండియా జనాభా చూసి ప్రతి ఒక్క దేశం కూడా అవహేళన చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా దేశం ను కూడా ప్రపంచ దేశాలు చిన్నచూపు చూశాయి. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు జనాభా ఎక్కువ అంటూ విమర్శలు పొందిన దేశాలు.. ఆ జనాభా కారణంగా అభివృద్ది లో దూసుకుపోతున్నాయి.

జనాభా నియంత్రణ చేపట్టిన చైనా ఇప్పుడు ఆ పని ఎందుకు చేశామా అంటూ తల బాదుకుంటూ ఉంది. దేశవ్యాప్తంగా ఒక్కొక్క జంట ముగ్గురు నలుగురు పిల్లలను కనాలి అంటూ పిలుపునిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఎదురైన పరిస్థితి గుణపాఠంగా అన్ని దేశాలు కూడా తమ దేశంలో కుటుంబ నియంత్రణ అనే పదాన్ని కూడా వాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

జపాన్ లో గత కొన్ని సంవత్సరాలుగా జననాల రేటు దారుణంగా పడిపోయింది. అక్కడ యువత శాతం చాలా తగ్గింది. అలాగే పిల్లలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. రాబోయే కొన్ని సంవత్సరాలకు వృద్ధుల యొక్క శాతం విపరీతంగా పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయని.. మ్యాన్‌ పవర్ కోసం పక్క దేశాలపై ఆదారపడాల్సి రావచ్చు అంటున్నారు.

జననాల రేటు ఇదే స్థాయిలో ఉంటే రాబోయే కొన్ని సంవత్సరాలకు దేశం అదృశ్యం అయినా ఆశ్చర్యం లేదని స్వయంగా ఆ దేశం యొక్క ప్రధాన మంత్రి సలహాదారు ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.

జపాన్ యువత పెళ్లి.. పిల్లలపై ఆసక్తి చూపించడం లేదు. దాంతో దేశ జనాభా వృద్ధి అస్సలు లేదు. ఇది కచ్చితంగా అన్ని విధాలుగా ప్రమాదం అంటూ ప్రభుత్వ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గడచిన దశాబ్ద కాలంగా జనాభా క్షీణించడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం పుట్టే పిల్లలకు కూడా రాబోయే కాలంలో ఇది ప్రమాదంగా దాపరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జపాన్ జనాభా క్షీణత భద్రత బలగాల యొక్క బలం పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ విపత్తు నుండి జపాన్ ఎలా బయట పడుతుంది అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.