Begin typing your search above and press return to search.
చేరిన ప్రతీచోట లేఆఫ్స్.. నాలుగు సార్లు ఔట్..'టెకీ' కన్నీటి కథ
By: Tupaki Desk | 7 April 2023 8:00 AM GMTప్రపంచ టెక్ పరిశ్రమను ఇప్పుడు మాంద్యం భయం పట్టిపీడిస్తోంది. ఈపేరు చెప్పి గూగుల్ నుంచి మొదలుపెడితే సాధారణ కంపెనీల వరకూ ఉద్యోగులను 'లేఆఫ్స్' అంటూ ఉన్న ఫళంగా తొలగించేస్తున్నాయి. సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ తొలగింపుల పర్వం ఇప్పటికీ సాగుతోంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు సైతం రెగ్యులర్ గా తొలగింపులు చేపడుతుండడంతో ఇప్పుడు 'లేఆఫ్స్' పేరు చెబితేనే ఉద్యోగులు వణికి చస్తున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే ఒకసారి లేఆఫ్ అంటూ ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి జీవితం తాజా లేఆఫ్ లతో మరింత దుర్భరంగా మారిందట.. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు కంపెనీలు మారితే నాలుగు సార్లు ఆ ఉద్యోగిని తొలగించిన దయనీయ పరిస్థితులు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు ఆ ఉద్యోగి కథ అందరినీ కదిలిస్తోంది.
కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జానెన్ అన్నే పనెన్ (33) అనే యువతి టెక్ కెరీర్ లో వరుసగా నాలుగుసార్లు లేఆఫ్స్ కు గురై ఉద్యోగాలు కోల్పోయింది. ఆమె తన మొదటి ఉద్యోగాన్ని 'రెడ్డిట్'లో ప్రారంభించింది. రెండు నెలల పాటు సోషల్ మీడియా అసిస్టెంట్ గా పనిచేసింది. ఆ కంపెనీ ఆమెతోపాటు మొత్తం బృందాన్ని కూడా తొలగించి షాక్ ఇచ్చింది. అనంతరం 'ఉబెర్'లో హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం సంపాదించి చేరింది. అక్కడ రెండేళ్ల తర్వాత ఆమెకు లేఆఫ్ ఇచ్చి ఉద్యోగంలోంచి తీసేశారు.
ఇక ఆ తర్వాత 'డ్రాప్ బాక్స్' కంపెనీలో ఇంజినీర్ గా చేరిన జానెన్ అక్కడ రెండేళ్లు పనిచేసింది. రెండేళ్లు ముగియగానే జానెన్ ను ఇక్కడ కూడా తొలగించారు. ఇక చేసేందేం లేక మరో ఉద్యోగ వేటలో పడింది జానెన్..
పోయిన వారమే స్నాప్ డాక్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జానెన్ చేరింది. ఇంతలోనే ఏమైందో ఏమో వారం తిరిగేసరికి ఈమె నాలుగో ఉద్యోగం కూడా పోయింది. తన నాలుగు లేఆఫ్స్ గురించి ఆమె భావోద్వేగంతో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'తొలి ఉద్యోగం కోల్పోయినప్పుడు జీవితం నిస్సారంగా అనిపించింది. ఎంతో బాధపడ్డాను. మూడోసారి అయితే మొత్తం మా టీంను తొలగించినప్పుడు మానసికంగా కృంగిపోయాను. ఇప్పుడు నాలుగోసారి తీసేయడంతో ఆర్థిక పరిస్థితి దుర్బరంగా మారింది' అంటూ ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ వల్ల టెకీలు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారని వివరించింది. ఈమె స్టోరీ ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను కదిలిస్తోంది. ఈ ఇండస్ట్రీలోని దుర్భర పరిస్థితులను కళ్లకు కడుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.