Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ అర్థ‌రాత్రి సెంటిమెంట్.. మ‌రో లిస్ట్ రిలీజ్!

By:  Tupaki Desk   |   19 March 2019 4:40 AM GMT
ప‌వ‌న్ అర్థ‌రాత్రి సెంటిమెంట్.. మ‌రో లిస్ట్ రిలీజ్!
X
పొద్దున నుంచి రాత్రి వ‌ర‌కు కుద‌ర‌దో.. మ‌రింకేదైనా ప్ర‌త్యేక కార‌ణ‌మో.. బ‌య‌ట‌కు చెప్ప‌ని సెంటిమెంట్ ఏమైనా ఉందో ఏమో కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత త‌మ అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసే తీరును చూస్తేనే ఉన్నాం. తాజాగా ఆ అన‌వాయితీని త‌ప్ప‌కుండా సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత మ‌రో జాబితాను విడుద‌ల చేశారు.

తాజాగా రిలీజ్ చేసిన లిస్ట్ లో ఏపీలోని 13 అసెంబ్లీ స్థానాల‌కు.. ఒక లోక్ స‌భ స్థానానికి త‌మ పార్టీ నుంచి పోటీ చేసే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే ఆదివారం అర్థ‌రాత్రి విడుద‌ల చేసిన రెండో జాబితాలో పేర్కొన్న ఒక అభ్య‌ర్థి స్థానాన్ని మార్చారు.

గిద్ద‌లూరు స్థానం కోసం పార్టీ అభ్య‌ర్థిగా షేక్ రియాజ్ ను ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో గిద్ద‌లూరు స్థానం నుంచి భైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్ పోటీ చేస్తార‌ని వెల్ల‌డించారు.

తాజాగా విడుద‌ల చేసిన పార్టీ అభ్య‌ర్థుల జాబితాను చూస్తే..

అసెంబ్లీ అభ్య‌ర్థులు

1. టెక్కలి: కణితి కిరణ్‌ కుమార్‌

2. పాలకొల్లు: గుణ్ణం నాగబాబు

3. గుంటూరు తూర్పు: షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌

4. రేపల్లె: కమతం సాంబశివరావు

5. చిలకలూరిపేట: మిరియాల రత్నకుమారి

6. మాచర్ల: కె.రమాదేవి

7. బాపట్ల: పులుగు మధుసూదన్‌ రెడ్డి

8. ఒంగోలు: షేక్‌ రియాజ్

9. మార్కాపురం: ఇమ్మడి కాశీనాథ్‌

10. గిద్దలూరు: బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌

11. ప్రొద్దుటూరు: ఇంజా సోమశేఖర్‌ రెడ్డి

12. నెల్లూరు నగరం: కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి

13. మైదుకూరు: పందింటి మల్హోత్రా

14.కదిరి: సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు)

లోక్ స‌భ అభ్య‌ర్థి

1. ఒంగోలు (లోక్‌సభ): బెల్లంకొండ సాయిబాబా