Begin typing your search above and press return to search.

పోయిన చోటే పవన్ వెతుక్కుంటారా...ఈసారి పక్కా...?

By:  Tupaki Desk   |   25 May 2023 5:00 AM GMT
పోయిన చోటే పవన్ వెతుక్కుంటారా...ఈసారి పక్కా...?
X
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దాదాపుగా అరడజను కి పైగా సీట్లను ముందు పెట్టి పవన్ పోటీ చేసేది ఇక్కడే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వండి వార్చేస్తునారు. ఇక 2019లో పవన్ గాజువాక, భీమవరంలలో పోటీ చేశారు. ఈ రెండు చోట్లలో ఏదో ఒక దాన్ని ఆయన మళ్లీ ఎంచుకుంటారు అని అంటున్నారు.

అదే విధంగా పొత్తుల విషయంలో టీడీపీని కోరే సీట్ల దగ్గర చూసుకుంటే కనుక గాజువాక, భీమవరం కచ్చితంగా ఉంటాయని అంటున్నారు. ఇక భీమవరం నుంచి పవన్ని పోటీ చేయమంటూ ఒత్తిడి పెరుగుతోంది. గోదావరి జిల్లాల నుంచి పవన్ పోటీకి దిగితే అది జనసేనకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

ఇక ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేలు కూడా జనసేనకు గోదావరి జిల్లాలలో గ్రాఫ్ పెద్ద ఎత్తున పెరిగిందని చెబుతున్నాయి. అదే విధంగా భీమవరంలో అయితే పొత్తులు ఉన్నా లేకపోయినా పవన్ పోటీ చేస్తే చాలు బంపర్ మెజారిటీతో ఈసారి జనసేన జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు. మరి పొత్తుల విషయంలో కనుక అన్నీ కుదిరితే టీడీపీతో జట్టు కడితే పవన్ పోటీ చేస్తే కనుక ఏకంగా అర లక్ష మెజారిటీ పవన్ కి దక్కడం ఖాయమని సర్వే నివేదికలు చెబుతున్నాయని సమాచారం.

అంటే ఈసారి హోరా హోరీ ఫైట్ సాగుతుంది అని అంతా భావిస్తున్న తరుణంలో బోటాబొటీ మెజారిటీలు మాత్రమే అత్యధిక నియోజకవర్గాలలో నమోదు అవుతాయని విశ్లేషణలు ఉన్న నేపధ్యంలో అత్యధిక మెజారిటీలు పవన్ రూపంలో వస్తే కనుక జనసేన గోదావరి జిల్లాలలో అనుకూల ప్రభంజనం క్రియేట్ చేస్తున్నట్లుగానే భావించాలి.

జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని, తన సొంత నివేదికలు ఉన్నాయని పవన్ ఇటీవాల మంగళగిరి మీటింగులో చెప్పిన సంగతి విధితమే. ఇపుడు అదే నిజం అవుతుందని మరి కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయట. మొత్తంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ జనసేన పోటీ చేస్తే వీటిలో అత్యధిక శాతం సీట్లు కైవశం చేసుకోవడమే కాదు భారీ మెజారిటీలు సైతం చాలా చోట్ల వస్తాయని నివేదికలు తేల్చుతున్నాయని అంటున్నారు.

పవన్ వరకూ చూస్తే ఆయన ఇంకా ఏమీ స్పష్టం చేయలేదు కానీ గోదావరి జిల్లాల మీద మమకారం అయితే ఆయనకు ఉంది అని అంటున్నారు. అది కూడా పోయిన చోట వెతుక్కోవాలని ఈసారి బ్రహ్మాండంగా గెలిచి ఢంకా భజాయించాలని భావిస్తున్నారు అని అంటున్నారు.

అయితే పవన్ పోటీ చేస్తే చాలు. జస్ట్ అలా వచ్చి నామినేషన్ వేస్తే చాలు గెలిపించుకుంటామన్న నియోజకవర్గాల జాబితా చూస్తే భీమవరం, గాజువాకలతో పాటు, కాకినాడ రూరల్, పిఠాపురం, తిరుపతి, అనంతపురం వంటివి ఉనాయని చెబుతున్నారు.

ఇంతకీ పవన్ మదిలో ఏముందో బయట పడడంలేదు. పవన్ ఈసారి ఒక చోట పోటీ చేస్తారా లేక రెండు చోట్ల నుంచి బరిలో ఉంటారా అన్నది కూడా తెలియడంలేదు. అయితే టీడీపీతో పొత్తు ఉంటే మాత్రం పవన్ ఒక్క చోటనే పోటీ చేస్తారని, అంతే కాకుండా జనసేనకు సెంటిమెంట్ గా ఉన్న సీట్లను పొత్తులో భాగంగా తీసుకుని తన వారిని కూడా గెలిపించుకుంటారని అంటున్నారు.

పవన్ పోటీ చేసే సీటు విషయంలో పక్కా క్లారిటీతోనే ఉన్నారని, సరైన సమయంలోనే ఆయన దాన్ని రివీల్ చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా మంగళగిరి నుంచి లోకేష్ ఫిక్స్. కుప్పంలో చంద్రబాబు పులివెందుల నుంచి జగన్ ఎటూ ఫిక్స్. తేలాల్సింది పవన్ కళ్యాణ్ సీటు విషయమే. అది ఎన్నికలకు దగ్గర చేసి తేలుతుంది అని అంటున్నారు. ఆరు నూరు అయినా విపక్షంలోని కీలక నేతలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు చేస్తున్న సవాల్ కి జవాబు గా ప్రతిపక్ష నేతలు కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయి. దాంతో పవన్ పోటీ చేసే సీటు విషయం సస్పెన్స్ లోనే పెడుతూ ఆ ఆసక్తిని అలా కంటిన్యూ చేస్తున్నారు.