Begin typing your search above and press return to search.
ప్లాన్ బీ కూడా రెడీ చేస్తున్న పవన్....?
By: Tupaki Desk | 1 Feb 2023 8:00 AM GMTరాజకీయాల్లో ఒకే ప్లాన్ తో వెళ్తే వర్కౌట్ అవదు. పైగా ప్లాన్ కాగితాల మీద రాసుకున్నంతగా అమలు అయ్యేది ఉండదు. ఇక ఆలోచనలకు ఆచరణకు మధ్య తేడా చాలా ఉంటుంది. ఈ మధ్యలో ఎత్తులు పై ఎత్తులతో ప్లాన్ అనుకున్న తీరున సాగకపోతే ప్లాన్ బీ కూడా అవసరమే. రాజకీయంగా ఇపుడిపుడే రాటుతేలుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ బీని కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏ ప్లాన్ బీ ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో తాను ఎలాగైనా అధికారానికి దగ్గర కావడానికి మార్గాలు వేసుకోవడమే అని అంటున్నారు. ముందుగా ప్లాన్ ఏ గురించి చెప్పుకుంటే ఇది సాఫీగా సాగిపోతే ప్లాన్ బీ అన్న ప్రసక్తే ఉండదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోందేందుకు ఒంటరి పోరు వద్దు పొత్తులు ముఖ్యమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. పైగా ఎన్నికలు దగ్గరకు వచ్చేసిన వేళ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా కష్టమే.
అందువల్ల పొత్తులతో గౌరవ ప్రదమైన స్థానాలలో పోటీకి దిగి ఆ మీదట అధికారంలో వాటాను కోరే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏ ని రూపొందించుకున్నారు అని అంటున్నారు. ప్లాన్ ఏ ప్రకారం తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది. చివరిలో బీజేపీ కూడా వచ్చి చేరే చాన్స్ ఉంటుంది. ఇక జనసేనకు కచ్చితంగా యాభై నుంచి అరవై సీట్లు ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఆ సీట్లు కనుక ఇస్తేనే పొత్తుకు అవకాశం ఉంటుంది అని జనసేన నేతలు భావిస్తున్నారు.
ఎందుకంటే జనసేన అధికార పీఠానికి చేరువ కావాలీ అంటే ఈ నంబర్ చాలా ముఖ్యం. అయితే ఇన్ని సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం ఒప్పుకోకపోతే ప్లాన్ బీ చూసుకోవాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే పాతిక నుంచి ముప్పయి సీట్లకే ఈ పొత్తును తెగ్గొడతారు అని. అంతకంటే ఒక్క సీటు కూడా ఎక్కువ ఇవ్వరాదు అని. దాంతో ఈ లోపాయికారీ సమాచారం తెలిసే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా ప్లాన్ బీని బయటకు తీశారూ అని అంటున్నరు.
బీజేపీతో తమ పొత్తు ఉందని పవన్ సడెన్ గా ప్రకటించడం వ్యూహాత్మకనే అని అంటున్నారు. సరిగ్గా బీజేపీ కూడా అదే పవన్ నోటి నుంచి వీఅలనుకుంటోంది. దాంతో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. దీని వల్ల బీజేపీని వీడకుండా ఉండడం, అదే టైంలో తెలుగుదేశానికి ఇండైరెక్ట్ గా సంకేతాలు పంపడమే అని అంటున్నారు. తెలుగుదేశం కనుక జనసేన కోరుకున్న సీట్లు కేటాయించకపోతే తమకు బీజేపీ పొత్తు ఉందని వారితో కలసి పోటీ చేస్తామని పవన్ సందేశం ఇచ్చారని అంటున్నారు.
అయితే దీని వల్ల పవన్ కి కలసి వచ్చేది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ సాయం అందుతుందని, బీజేపీ మోడీ, అమిత్ షా వంటి పెద్దలు జనసేనకు అండగా ఉంటారని అంటున్నారు. ఇక బీజేపీకి ఏపీలో యాభై సీట్లు ఇచ్చి మిగిలిన వాటిలో పవన్ పోటీ చేయడమే ప్లాన్ బీ అంటున్నారు. అంటే పవన్ మోడీ చరిష్మాతో ఎన్నికల గోదాలోకి దిగడం అన్న మాట. దీని వల్ల అనుకున్న రిజల్ట్స్ రాకపోయినా రేపటి రోజున కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పవన్ అధికారిక ప్రాధాన్యత ఉంటుంది అని అంటున్నారు. ఇక తెలుగుదేశం జనసేన వేరుగా పోటీ చేస్తే ఓట్ల చీలిక అన్నది అనివార్యంగా జరుగుతుంది. దాని వల్ల జనసేన బీజేపీ కంటే తెలుగుదేశానికే ఎక్కువ నష్టం ఉంటుంది.
సో విధంగా ప్లాన్ బీ ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. అయితే తెలుగుదేశం మాత్రం ఇప్పటికైతే ఏమీ ఆలోచన చేయడంలేదు అని అంటున్నారు. ఎన్నికల ముందు పొత్తుల విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని చూస్తోంది. ఏది ఏమైనా ద్విముఖ్య వ్యూహంతో మాత్రం జనసేనాని ఉన్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.