Begin typing your search above and press return to search.
పవన్ సర్ క్లారిటీ ఇచ్చేసినట్టేగా.. జనసైనికులు బీ అలెర్ట్...!
By: Tupaki Desk | 18 April 2023 5:00 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. క్లారిటీ ఇచ్చేసినట్టుగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎ న్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకును చీల్చకుండా.. టీడీపీకి అధికారం దక్కేలా ఆయన వ్యూహాత్మకంగా ప్రయో గాలు చేయనున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు. ఎందుకంటే.. ఏపీలో ఒకవైపు.. వైసీపీ తన పా ర్టీ నేతలకు, ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల దగ్గరకు పంపిస్తోంది. ఒకటికి రెండు సార్లు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తోంది.
మంచి-చెడులపై ఆరా తీస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక, అదేస మయంలో టీడీపీ కూడా.. ఈ ప్రయత్నమే చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు.. ఆయన తనయుడు యు వ నాయకుడు.. నారా లోకేష్ కూడా ప్రజల మధ్యే ఉంటున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. ఈ ప్రయత్నా లు చూస్తే ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజల కొరకు.. అనేలా.. ఈ రెండు పార్టీలే ఉన్నట్టుగా ప్రజల మధ్య చర్చ సాగుతోంది.
అంతేకదా.. వ్యక్తిగతంగా చూసుకున్నా..మన కోసం తపించేవారే.. మనవారు అవుతారు కానీ, చుట్టపుచూపు గా వచ్చి పోయే వారు కారుకదా!! అనే భావన ప్రజల్లో వినిపిస్తోంది. జనసేన విషయంలో మరీ ముఖ్యంగా ఇది కనిపిస్తోంది. సినీమాల షెడ్యూల్ కారణంగా.. పవన్ బిజీకావొచ్చు. దీనిని ఎవరూ తప్పుపట్టరు. కానీ, మిగిలిన నాయకులను ముందుండి నడిపించేప్రయత్నం కూడా చేయకపోవడం.. ఏంటనేది ప్రధాన ప్రశ్న.
అంటే.. ఇప్పుడు ప్రజల మధ్య జరుగుతున్న చర్చ.. కీలక నాయకుల మధ్య జరుగుతున్న సంభాషణల నుంచి తెలుస్తున్నది ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసినా.. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒంటరిగా ఎదగాలని మాత్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపించడం లేదన్నమాట. వారాహి ఏమైందో తెలియదు.. వైసీపీ నాయకులు ఆపేస్తారని ప్రచారం చేసుకున్న పవన్.. తనకు తానే వారాహికి బ్రేకులు వేసుకున్నారు. మరి ఈ పరిణామాలతో పవన్ క్లారిటీ ఇచ్చేసినట్టుగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.