Begin typing your search above and press return to search.

జ‌న‌సేన రెండో ద‌శ ఎంపిక‌కు షెడ్యూల్ ఇదే

By:  Tupaki Desk   |   13 May 2017 4:01 PM GMT
జ‌న‌సేన రెండో ద‌శ ఎంపిక‌కు షెడ్యూల్ ఇదే
X
ఎంపిక ప్ర‌క్రియ ద్వారా త‌న‌తో న‌డిచే వారిని ఎంచుకునేందుకు సిద్ధ‌మైన జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీకి చెందిన రెండో ద‌శ కార్య‌క‌ర్త‌ల ఎంపిక‌కు షెడ్యూల్ సిద్ధం చేశారు. ఈ మేర‌కు జ‌న‌సేన తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అనంతపురం శిబిరానికి హాజరైన అభ్యర్థులను స్వయంగా కలిసే ప్రక్రియను ప్రారంభిస్తున్నార‌ని తెలిపారు. మొదటి బ్యాచ్ ని హైదరాబాద్ లో ఆదివారం కలుస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.మిగిలిన వారిని ఎప్పుడు, ఎక్కడ కలిసేది త్వరలోనే తెలియచేస్తామ‌ని వివ‌రించారు.

రెండో ద‌శ జ‌న‌సైనికుల గురించి జన‌సేన విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఇది ``ఉత్తరాంధ్ర - గ్రేటర్ హైదరాబాద్ లలో జరిగే జనసేన గుర్తింపు శిబిరాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతున్నాయి. 17 - 18 తేదీల్లో శ్రీకాకుళం - 19 - 20న విశాఖ జిల్లా - 23 - 24 - 25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఈ శిబిరాలు జరుగుతాయి. స్పీకర్స్ (వక్త) - అనలిస్ట్ కంటెంట్ రైటర్స్ గా సేవలు అందించడానికి ఉత్తరాంధ్ర నుంచి 6000 - గ్రేటర్ హైదరాబాద్ నుంచి 4500 దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా జనసేన పరిపాలన కార్యాలయానికి అందాయి. అభ్యర్థులు అందరికీ పేరుపేరున శుభాభినందనలు తెలియచేస్తున్నాను. రాజకీయాల్లో ప్రతిభవంతులైన యువకులు - మేధావులను భాగస్వామ్యుల్ని చేయాలన్న నా తలంపునకు మీరు అందిస్తున్న సహకారం చాతి విలువయినదిగా భావిస్తున్నాను. శిబిరం సమయం - మిగిలిన వివరాలను ధరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియచేస్తారు.

janasenaparty.org/Srikakulam.pdf
janasenaparty.org/Visakha.pdf
janaSenaparty.org/hyd.pdf లేదా జ‌న‌సేన ఫేస్‌ బుక్ పేజీ ద్వారా కూడ వివరాలు తెలుసుకోవచ్చు`` అని ప‌వ‌న్ పేరుతో జ‌న‌సేన ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసింది.

జనసేన శిబిరాలు జరిగే ప్రాంతాలు ఇవి

శ్రీకాకుళం:
బాపూజీ కళామందిర్
2వ పోలీస్ స్టేషన్ ఎదురుగా,
7వ రోడ్ జంక్షన్,
శ్రీకాకుళం
532OO1

విశాఖ శ్రీ కృష్ణ విద్య మందిర్
తిలక్ షోరూం ఎదురుగా
BVK కాలేజీ దగ్గరలో, ద్వారకా నగర్ . విశాఖపట్నం.
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌,
ఏఎంఆర్ గార్డెన్స్‌, దోల-రి-దాని ఎదురుగా
కొంపల్లి, మేడ్చల్ రోడ్,సికింద్రాబాద్