Begin typing your search above and press return to search.

నేను వైసీసీ కార్యకర్తనే..నీకేంటి ప్రాబ్లం..!

By:  Tupaki Desk   |   8 Jan 2021 6:20 AM GMT
నేను వైసీసీ కార్యకర్తనే..నీకేంటి ప్రాబ్లం..!
X
గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. అయితే వరప్రసాద్​ గత కొంతకాలంగా వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పటికే అనేకసార్లు అసెంబ్లీలో సీఎం జగన్​మోహన్​రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేగానే ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని అర్థం కాక జనసేనాని తికమక పడుతున్నారు. ఇప్పటికే పలుసార్లు జనసేన అధినేతను ఆయన విమర్శించారు.

నిజానికి రాపాక వరప్రసాద్​ మొదట వైసీపీలో ఉండేవారు. అయితే ఆయనకు రాజోలు టికెట్​ దక్కకపోవడంతో జనసేన టికెట్​తో గెలుపొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్సార్​ కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఆయన వైసీసీ నేతలకు దగ్గరయ్యారు. మరోవైపు ఆయన కుమారుడు సీఎం జగన్​ సమక్షంలో వైసీసీ కండువా కప్పుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాపాక.. ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను వైసీపీ కార్యకర్తను. వైసీపీ ఎమ్మెల్యేనే. ఈ విషయంపై జనసేన అధినేత పవన్​కల్యాణ్​కు ఇబ్బంది ఏమిటి?’ అంటూ ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మరోవైపు కొంతకాలంగా రాపాక వరప్రసాద్​పై జనసేన సోషల్​మీడియా తీవ్రంగా విరుచుకుపడుతున్నది. జనసేన ఫేస్​బుక్​ గ్రూపుల్లో రాపాక వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. గ్లాసు గుర్తుపై గెలుపొంది.. జనసేన అధినేత పవన్​ కల్యాణ్​పై విమర్శలు చేయడం ఏమిటని సోషల్​మీడియా జనసైనికులు పోస్టులు పెడుతున్నారు.