Begin typing your search above and press return to search.

అంబటి లెక్క తేల్చాల్సింది మేం కదా? బాబుపై జనసైనికుల గుస్సా

By:  Tupaki Desk   |   1 Jun 2023 1:00 PM GMT
అంబటి లెక్క తేల్చాల్సింది మేం కదా? బాబుపై జనసైనికుల గుస్సా
X
మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఐదారుగురి విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. జనసైనికులు సైతం మహా గుర్రుగా ఉన్నారు. తమ అధినేతను నోటికి వచ్చినట్లుగా అనేసిన వారి జాబితాలో టాప్ 5లో ఉన్న వైసీపీ నేతల్లో ఒకరు అంబటి రాంబాబుగా చెబుతారు. పవన్ ను ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన అంబటి లెక్కల్ని ఎన్నికల వేళ తేల్చాలన్న పట్టుదలతో జనసైనికులు ఉన్నట్లుగా చెబుతారు.

2019 ఎన్నికల వేళలో.. పవన్ ఎఫెక్టుతో తనను ఓడించొద్దని ప్రాధేయపడి మరీ ఓట్లు వేయించుకున్న ఆయన.. ఆ తర్వాతి కాలంలో జనసేనాని ని ఉద్దేశించి ఎంత మాట పడితే అంత మాట అనేందుకు వెనుకాడని అంబటిపై పీకల్లోతు కోపంతో ఉన్నారు జనసైనికులు. వైసీపీకి చెందిన నలుగురైదుగురి విషయంలో జనసైనికులు పట్టుదలతో ఉన్నారు. ఏది ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో తాము లెక్కలు తేల్చాల్సిన నేతల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ముందుంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

పవన్ ను ఉద్దేశించి నోరు పారేసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఎటకారంగా మాట్లాడిన మాటలపై జనసైనికులు తీవ్ర గుస్సాతో ఉన్నారు. జనసేనాని స్థాయి ఏమిటి? అంబటి స్థాయి ఏమిటి? అలాంటిది పవన్ ను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు మాట్లాడటమా? అందుకుమూల్యం చెల్లించాల్సిందేనన్న పట్టుదలతో జనసైనికులు ఉన్నారు.

ఎట్టి పరిస్థిత్లో అంబటికి ఓటమి రుచి చూపించాల్సిన బాధ్యతను వచ్చే ఎన్నికల్లో తాము తీసుకుంటామన్న వాదనను జనసైనికులు వినిపిస్తున్నారు. ఇదిలా ఉండి ఉంటే..తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లికి బాధ్యుడిగానియమిస్తూ లేఖను విడుదల చేశారు.

అంటే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కన్నాను దించటానికి రంగం సిద్దమైనట్లే. మిగిలిన సీట్లు సంగతి ఎలా ఉన్నా.. పవన్ ను అదే పనిగా టార్గెట్ చేసే కొందరు వైసీపీ నేతలకు ఎన్నికల యుద్ధంలో తమ సత్తా చాటాలని జనసైనికులు తహతహలాడుతున్నారు. అలాంటి సీట్లలో సత్తెనపల్లి ఒకటని.. దాన్ని తమను సంప్రదించకుండా ఇన్ ఛార్జిని నియమించటాన్ని తప్పు పడుతున్నారు.

ఏమైనా.. పొత్తు ఖాయమన్న విషయంపై క్లారిటీ వచ్చేసిన వేళలో.. కొన్ని కీలక నియోజకవర్గాల్లో తీసుకునే నిర్ణయంపై చంద్రబాబు తొందరపాటు నిర్ణయాలు ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయాన్ని జనసైనికులు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.