Begin typing your search above and press return to search.

ఆ పవన్ ఫ్లెక్సీ పై ఆగ్రహం.. చించేసిన జనసేన నేత రేఖా గౌడ్

By:  Tupaki Desk   |   1 Jun 2023 10:14 AM GMT
ఆ పవన్ ఫ్లెక్సీ పై ఆగ్రహం.. చించేసిన జనసేన నేత రేఖా గౌడ్
X
ఏపీ లో ఇప్పుడు ఫ్లెక్సీల యుద్ధం సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నోటి నుంచి వచ్చిన క్లాస్ వార్ కు కొనసాగింపుగా ఫ్లెక్సీ వార్ షురూ అయ్యింది. క్లాస్ వార్ ను తన ప్రసంగాల్లో అదే పనిగా ప్రస్తావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటల కు తగ్గట్లే.

వైసీపీ నేతలు.. మద్దతుదారులు చంద్రబాబు.. పవన్ లపై ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ఇప్పుడు కొత్త ఉద్రిక్తతల కు కారణమవుతున్నాయి. పేదలకు.. పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం పేరుతో వైసీపీ నేతలు ఆటవికంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు జనసైని కులు.

తాజాగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన పవన్ వ్యతిరేక ఫ్లెక్సీల పై జనసేన నేత రేఖా గౌడ్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు పల్లకి ని మోస్తున్న ఫ్లెక్సీల ను ఏర్పాటు చేయటం పై మండిపడుతూ.. ఆయా ఫ్లెక్సీల ను చించేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ తరహా ఫ్లెక్సీల ను ఏర్పాటు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఫైర్ అయ్యారు.

పవన్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆమె చించేశారు. వైసీపీ నేతల తీరుతో జనసైని కుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని.. ఇలాంటి వాటి పై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీని ఆమె కోరారు. ఈ తరహా ఫ్లెక్సీల కారణంగా అనవసర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని.. వీటి పై చర్యలు తీసుకోవాలని కోరారు.