Begin typing your search above and press return to search.
విశాఖ కోసం జనసేన వినూత్న నిరసన
By: Tupaki Desk | 31 Jan 2022 2:30 AM GMTజనసేన ఏపీలో ముందు వరసలోకి రావడానికి చూస్తోంది. తమకు తెలిసిన ప్రతీ సమస్య మీద ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. అయితే వారు కొన్ని సార్లు సంప్రదాయ విధానంలో కాకుండా కొత్త మార్గాలను ఎన్నుకోవడం విశేషం. ప్రతీదానికీ ఎంతసేపూ మీడియా ముందు గొంతులు చించుకుంటూ తిట్ల పురాణం లంకించుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు సవాళ్ళు చేస్తూ ఉంటాయి.
అయితే జనసేన కాస్తా వాటిని భిన్న కొత్త పద్ధతిలో చేస్తూ ఉంటుంది. విశాఖ గంజాయికి అడ్డాగా మారింది అని అన్ని పార్టీలు గోడు పెడుతూనే ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అయితే దీని మీద ఆ మధ్య అతి పెద్ద రచ్చ చేసింది కూడా. అయినా సరే విశాఖ నుంచి అక్రమ గంజాయి రవాణా అన్నది ఆగడంలేదు. దేశం నుంచి విదేశాలకు తరలిపోతున్న గంజాయి విషయంలో మూలాలు విశాఖలోనే ఉన్నాయని అంతా ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా గంజాయిని విశాఖ నుంచి శాశ్వతంగా నిర్మూలించాలంటూ జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు మీడియాను ఆశ్రయించలేదు, ధర్నాలు చేయలేదు, మీటింగులు పెట్టి మరీ జనాలను పోగేసి చెప్పలేదు, విశాఖ బీచ్ లో సైకత శిల్పాన్ని నిర్మించారు. దాని మీద సేవ్ వైజాగ్ అని రాశారు. గంజాయి బారి నుంచి విశాఖను కాపాడండి అంటూ కూడా రాశారు.
దీంతో సందర్శకులతో కిటకిటలాడే విశాఖ బీచ్ లో ఈ నినాదం క్షణాల్లో జనాల మెదళ్ళలోకి పాకుతోంది. ఆ విధంగా జనంలో ఆలోచనలు రేకెత్తించడంతో పాటు పాలకుల దృష్టికి వచ్చేలా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జనసైనికులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
విశాఖకు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు ఉందని, అలాంటి సిటీ ఇపుడు గంజాయి కి అడ్డాగా మారడం అంటే బాధాకరమని జనసైనికులు అంటున్నారు. విశాఖ మీదుగానే చెన్నై, ముంబై, బెంగుళూరు, గోవాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ కేంద్రంగా పలు గ్యాంగులు పట్టుబడడం మీద జనసైనికులు ఆందోళన వ్యక్తం చేశారు.
మొత్తానికి చూస్తే శాంతియుతంగానే విశాఖలో అక్రమ గంజాయి మీద జనసైనికులు చేస్తున్న పోరాటం అందరినీ ఆకట్టుకుంటోంది. మరి పాలకులు ఇకనైనా దీని మీద దృష్టి సారించాలని నగర వాసులు కూడా కోరుతున్నారు. గంజాయి రహిత విశాఖే తమకు కావాలని కూడా నినదిస్తున్నారు.