Begin typing your search above and press return to search.
బుచ్చయ్యకు గ్లాస్ దెబ్బ.. వైసీపీకి ప్లస్
By: Tupaki Desk | 11 May 2019 5:34 AM GMTఅందమైన గోదావరి తీరం గట్టున ఉంది. సగం పట్టణం.. సగం పల్లె వాతావరణం..చల్లటి ఉద్యానవనాలు ఉన్న ప్రాంతం రాజమండ్రి రూరల్..ఓటర్లలో సగానికి మించి రైతులు, రైతు కూలీలే.. రూరల్ నియోజకవర్గం ఏర్పాటు తర్వాత ఈసారి జరిగినవి మూడో ఎన్నికలు.. గడిచిన రెండు సార్లు రాజమండ్రి రూరల్ లో టీడీపీనే గెలిచింది.ఈసారి కూడా టీడీపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డారు. గెలుపుపై ధీమాగా ఉన్నారు.
రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ తరుఫున పోటీచేసింది ఆషామాషీ లీడర్ కాదు.. టీడీపీలోనే సీనియర్ నేత.. తొమ్మిదో సారి ఆయన బరిలో నిలిచారు. రాజమండ్రి సిటీలో 1983 నుంచి 2009 వరకు నాలుగు సార్లు గెలిచి.. మూడు సార్లు ఓడిపోయారు. 2014లో రూరల్ నియోజకవర్గానికి మారి గెలిచారు.
వైసీపీ నుంచి ఆకుల వీర్రాజు - మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ జనసేన నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014లో కాంగ్రెస్ తరుఫున కాంగ్రెస్ ఎంపీగా రాజమండ్రి నుంచి పోటీచేసిన కందుల దుర్గేష్ బలమైన నేతగా ఉన్నారు. రాజమండ్రి రూరల్ - కడియం మండలాలతో ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి 73.45 శాతం పోలింగ్ జరిగింది.
రాజమండ్రి రూరల్ లో కులాల ప్రభావం చాలా ఎక్కువ. అత్యధికంగా 52వేల మంది కాపు ఓటు బ్యాంకు ఉంది. వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు - జనసేన అభ్యర్థి దుర్గేష్ ఇద్దరు కాపు సామాజికవర్గమే కావడంతో వీరికి ఎన్ని ఓట్లు చీలాయి.. తమకు ఎంత లాభం అనే సమాలోచనల్లో టీడీపీ ఉంది. అయితే గత ఎన్నికల్లో కాపులంతా టీడీపీకి ఓటు వేశారు. ఈసారి మాత్రం కాపులంతా టీడీపీపై ఆగ్రహంగా ఉన్నారు. వారు జనసేనకు - వైసీపీకి మద్దతిస్తే ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయమనే అంచనాలున్నాయి. ఆ తర్వాత శెట్టి బలిజల ఓట్లు 36వేలు - ఎస్సీలవి 23వేల ఓట్లు - కమ్మ సామాజికవర్గానివి 16వేల ఓట్లున్నాయి. ఎస్సీ - శెట్టి బలిజల ఓట్లపై ఆశలు పెంచుకున్నారు వైసీపీ అభ్యర్థి వీర్రాజు. ఇక కాపు ఓట్లపైనే జనసేన అభ్యర్థి దుర్గేష్ నమ్మకంతో ఉన్నారు.
టీడీపీ మాత్రం టీడీపీ సంక్షేమ పథకాలు పొందిన వారిపైనే నమ్మకం ఉంది. లక్షమందికి పథకాలు అందాయని.. వారంతా తనకు ఓటేస్తే తనదేగెలుపు అని టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ధీమాగా ఉన్నారు. పదేళ్లుగా కంచుకోటగా ఉన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఈసారి కూడా టీడీపీ వశం అవుతుందా.? జనసేన గ్లాస్ దెబ్బ ఎవరికి పడిందనే టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. కాపు ఓట్లుచీలితే గెలుపు తనదేనని వైసీపీ కూడా ధీమాగా ఉంది.. చూడాలి మరి ఏం జరుగుతుందో..