Begin typing your search above and press return to search.
జనసేన ఫర్ సేల్....?
By: Tupaki Desk | 10 April 2023 5:00 PM GMTఏపీకి ఎన్నికల మూడ్ వచ్చేసింది. అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం ఏదో విధంగా జనాల్లోకి వెళ్తున్నాయి. తమ పార్టీలకు గేర్ మార్చి దూకుడు పెంచేశాయి. ఏపీ జనాలు కూడా ఈ రెండు పార్టీల మధ్యనే చీలి ఉన్నారు. రాజకీయాన్ని మార్చడానికి ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన జనసేనాని మాత్రం ఇంతవరకూ అడుగు తీసి బయటపెట్టలేదు. ఆయన పాలిటిక్స్ అంతా పార్ట్ టైం అన్నట్లుగానే సాగుతోంది అని అంటున్నారు.
పవన్ విషయానికి వస్తే ఇప్పటివరకూ ఏపీలోని గ్రామాల వద్దకే వెళ్ళడంలేదని అంటున్నారు. అదే సమయంలో టీడీపీతో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అలాగే బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్తున్నారు. ఇలాగే జనసేన మార్క్ రాజకీయం అయితే సాగుతోంది తప్ప జనం వద్దకు మాత్రం వారాహి రధం మాత్రం కదలడంలేదు.
అయితే టీడీపీ నేతలు మాత్రం బీజేపీతో వెళ్లమని కలుపుకోమని చెబుతున్నారుట. ఏపీలో చూస్తే బీజేపీకి కేవలం ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు అన్నది అంతటా తెలిసిన విషయంలో అలాంటి బీజేపీతో కలసి జనసేన వెళ్లినా పొత్తులతో వచ్చినా ఒరిగేది లేదు అంటున్నారు.
మరో వైపు చూస్తే ఈ మధ్యనే హడావుడిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలసి వచ్చారు. అయితే అక్కడ ఏమీ సరైన పరిష్కారం అయితే దొరకలేదనే అంటున్నారు. పై పెచ్చు బీజేపీ నేతలు కొంతమంది మీరు పార్టీని నడపలేకపోతున్నారు. కాబట్టి మీ పార్టీని బీజేపీలో కలిపేయండి, మేము పూర్తిగా సహకరిస్తాం, హెల్ప్ కావాల్సినంతగా చేస్తామని చాలా మాటలే చెప్పారని టాక్ అయితే బయట నడుస్తోంది.
నిజంగా అది నిజమేనా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు అయింది. ఈ రోజుకీ ఆయన కూడా గెలవలేదు, ఆయనకంటూ పోటీ చేసే నియోజకవర్గాన్ని చూసుకోలేదు. పార్టీలో నాయకులను చూస్తే తిప్పి తిప్పి కొట్టినా నాదెండ్ల మనోహర్ తప్ప ఎవరూ కనిపించడంలేదు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహరే ఎక్కడ పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేకపోతే క్యాడర్ కి ఏమి చెబుతారు అనందే ప్రశ్న.
ఇంకో వైపు చూస్తే నాయకుడిగా పవన్ ఫుల్ బిజీ కావచ్చు. ఆయనకు సినిమాలు జీవనాధారం కావచ్చు. అలాంటి టైం లో పార్టీలో కొంతమంది నాయకులను వేసి వారి ద్వారా ఎప్పటికపుడు జనంలో పార్టీ ఉండేలా చర్యలు తీసుకోవాలి కదా అన్న మాట కూడా ఉంది. పవన్ అయితే తన సినిమాలు షూటింగులతో నిండా మునిగారు. ఆయనకు కుదరకపోయినా జనంలో పార్టీ ఉండాలి.
ఆ విషయంలో పవన్ సరిగ్గా చేయలేకపోయారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే పొత్తులతోనే నెట్టుకుని రావాలనుకోవడం సమంజసం కాదని మాట వినిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత అస్థ్తిత్వాని నిలబెట్టుకోవాలి. అపుడే ఇతర పార్టీల వద్ద బేరసారాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే పవన్ రాజకీయంగా దూకుడు చేయాల్సిన తరుణంలో వ్యూహ లేమితోనా లేక అలా సైలెంట్ గా ఉండడమే అసలైన వ్యూహామా అనంది అర్ధం కావడం లేదు కానీ జనసేన మాత్ర ఎన్నికల ఏడాదిలో వేడెక్కడంలేదనే అంటున్నారు.
వైసీపీ టీడీపీలలో జోరు చూసిన జనసైనికులు అయితే తమ పార్టీ సంగతేంటి అని మాట్లాడుకుంటున్నారని టాక్. జనసేన అంటే ఒక ఉద్యమంగా ఒక ప్రశ్నించే పార్టీగా ఒక మార్పు తెచ్చే పార్టీగా రంగంలో ఉండాలని జనాభిమానం గెలుచుకోవాలని ఆశపడుతున్న జనసైనికులకు ఈ పరిణామాలు ఏవీ మింగుడు పడడంలేదు అని అంటున్నారు. జనసేన ఫర్ సేల్ అని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ప్రత్యర్ధులు సైతం జనసేన మీద సెటైర్లు వేస్తున్న పరిస్థితుల్లో ఏంటి అలా జరుగుతుందా అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారుట.
జనసేనలో ఎలాంటి యాక్టివిటీ లేకపోవడం అంతా సైలెంట్ గా ఉండడంతో ఈ ప్రచారంలో వాస్తవమెంత అని తర్కించుకుంటున్నారు అంటున్నారు. ఏది ఏమైనా రేపటి ఎన్నికల వేళ పదేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్న జనసేన ఈ కీలక సమయంలో జోరు పెంచకపోతే జరుగుతున్న ప్రచారాన్నే నిజమని నమ్మే ప్రమాదం అయితే ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.