Begin typing your search above and press return to search.

టీడీపీని టార్గెట్ చేస్తున్న జనసేన...?

By:  Tupaki Desk   |   9 July 2023 3:43 PM GMT
టీడీపీని టార్గెట్ చేస్తున్న జనసేన...?
X
ఏపీలో సరికొత్త రాజకీయం సాగుతోంది. అధికార వైసీపీ విపక్ష టీడీపీ మధ్యలో ఫైట్ అనుకుంటే జనసేన ఇపుడు దూకుడు చేస్తోంది. 2019 ఎన్నికల్లో తాను సొంతంగా రెండు సీట్లలో పోటీ చేఅసి ఓడినా పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో మాత్రం తన సత్తా గట్టిగానే చూపించేందుకు సమాయత్తం అవుతున్నారు. పవన్ స్పీడ్ చూస్తూంటే ఈసారి పెద్ద ప్లాన్ తోనే దిగారని అంటున్నారు.

ఆయన అసలైన ప్రత్యర్ధిగా వైసీపీని ఎంచుకున్న సగంతి జగద్విదితం. అది అందరికీ తెలుసు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం వల్ల టీడీపీ కూడా విలవిలలాడుతోంది అంటున్నారు. గోదావరి జిల్లాలలో టీడీపీకి మంచి పట్టుంది. ఆ పార్టీ అవిర్భావం నుంచి కూడా గోదావరి జిల్లాలు భుజానికెత్తుకున్నాయి. సాలిడ్ ఓటు బ్యాంక్ టీడీపీ సొంతం.

టీడీపీ ఓడినా గెలిచినా కూడా నికరంగా నలభై శాతం ఓటు బ్యాంక్ ఆ పార్టీకి గోదావరి జిల్లాలలో ఉంటోంది. ఇపుడు పవన్ ఫుల్ ఫోకస్ గోదావరి జిల్లాల మీద పెట్టేసారు. దాంతో పాటు చూస్తే 2019 నాటికి ఇప్పటికీ జనసేన గ్రాఫ్ బాగా పెరింది. అది కూడా గోదావరి జిల్లాలలో అయితే రెండు మూడు రెట్లు బలం పెరిగింది అని అంటున్నారు.

ఒక అంచనా ప్రకారం చూస్తే కచ్చితంగా జనసేన ఓటు బ్యాంక్ ప్రత్యేకించి గోదావరి జిల్లాలలో ఇరవై శాతానికి చేరుకుంది అని అంటున్నారు. అంటే అది ఎవరి ఓటు బ్యాంక్ నుంచి చిల్లుపడి జనసేనకు షిఫ్ట్ అయింది అన్న చర్చ కూడా వెంటనే మొదలవుతోంది. నిజంగా చెప్పలీ అంటే జాన్సేన ఓటు బ్యాంక్ టీడీపీ ఓటు బ్యాంక్ రెండూ కూడా ఒక్కటే. ఇక టీడీపీకి కొత్త కష్టాలు 2019 నుంచి ఏమిటి అంటే బీసీలలో భారీ చీలిక రావడం.

బీసీలు వైసీపీకి జై కొట్టడం. దాంతో గోదావరి జిల్లాలలో టీడీపీ గ్రాఫ్ మెల్లగా తగ్గుతోంది అని అంటున్నారు. గోదావరి జిల్లాలలో ప్రస్తుతం ఉన్న రాజకీయ ముఖ చిత్రం చూస్తే కాపులలో అతి పెద్ద సంఖ్య జనసేన చుట్టూ ర్యాలీ అవుతోంది. అదే సమయంలో బీసీలలో చీలిక వల్ల వైసీపీకి బీసీ ఓటు బ్యాంక్ పెరుగుతోంది. ఇంకో వైపు వైసీపీకి దళితుల ఓటు బ్యాంక్ అలాగే ఉంది. ఇక కాపులు టీడీపీకి వైసీపీకి కూడా తమదైన ఓటు బ్యాంక్ గా ఉన్నారు.

ఇపుడు రంగంలో ఉన్న జనసేన వైసీపీకి మద్దతుగా ఉన్న కాపులలో భారీ చీలిక తెచ్చింది. అదే సమయంలో టీడీపీ కాపులు కూడా జనసేన వైపు పోలరైజ్ అయ్యేలా కధ సాగుతోంది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. జనసేన మీద ప్రేమతో ఓటేసే వారు టీడీపీ నుంచి ఎక్కువగా చీలుతున్నారు. అదే టైం లో వైసీపీకి కమిటెడ్ గా ఉన్న వర్గాల నుంచి జనసేన పెద్దగా ఓట్లను వెనక్కి తేలేకపోతోంది.

కాపుల విషయంలో మాత్రం జనసేన తాను అనుకున్నది సాధిస్తూ ముందుకు పోతోంది. దీంతో గోదావరి జిల్లాలలో జనసేన జ్వరం బాగానే జనాలకు ఎక్కుతోంది. అది అల్టిమేట్ గా వైసీపీతో పాటు టీడీపీ ఓటు బ్యాంక్ ని దెబ్బేసే ప్రమాదం ఉందని అంటున్నారు. టీడీపీకి గోదావరి జిల్లాలలో కాపులు బీసీలు బేస్ గా ఉంటారు. కాపులలో భారీ చీలికతో పాటు బీసీలు వైసీపీ వైపు ఎక్కువగా షిఫ్ట్ అయితే టీడీపీ రెండిందాల నష్టపోతుంది అని అంటున్నారు.

ఇక వైసీపీ కాపు ఓట్ల నష్టాన్ని బీసీలతో భర్తీ చేద్దామని చూస్తోంది. దళితులు ఓటు బ్యాంక్ గా వైసీపీకి ఉండడం ప్లస్ పాయింట్ అంటున్నారు. ఈ రకమైన రాజకీయ సమీకరణలు టీడీపీకి దడ పుట్టించేలా ఉన్నాయని అంటున్నారు. పవన్ మరీ లోతుగా గోదావరి జిల్లల మీద ఫోకస్ పెడుతున్నారు. అది అంతిమంగా టీడీపీకి గుండె చెదిరే రిజల్ట్ ని ఇస్తునందా అన్న డౌట్లు ఉన్నాయి.

అయితే రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు చాలా వెళ్తుంది. ఇపుడు గోదావరి జిల్లాల మటుకు చూస్తే ఆల్టర్నేట్ ఫోర్స్ గా జనసేన ఎమర్జ్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు చేస్తున్న దూకుడు రాజకీయం మాత్రం సైకిల్ పార్టీకే ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు అధికార పక్షం ఒక వైపు ఉంటుంది. వ్యతిరేక శక్తుల ఓట్లనే జనసేన చీల్చుతోంది. అది అంతిమంగా టీడీపీ జనసేన దారిలో వెళ్ళేలా అనివార్య పరిస్థితిని కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో.