Begin typing your search above and press return to search.
జనసేన ముఖ్య నేత పోటీ ఎక్కడి నుంచి?
By: Tupaki Desk | 2 Feb 2023 1:09 PM GMTజనసేనలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తర్వాత స్థానం ఎవరిదంటే నాదెండ్ల మనోహర్ అని అందరూ చెబుతారు. ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా నాదెండ్ల మనోహర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పవన్ ఎక్కడుంటే నాదెండ్ల కూడా అక్కడే ఉంటున్నారు. ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి వ్యక్తులను కలవడానికి పవన్ వెళ్లినప్పుడు నాదెండ్ల మనోహర్ సైతం ఆయన వెంటే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన పొత్తు కుదిరే పక్షంలో తెనాలి సీటును జనసేనకు వదిలేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ తర్వాత స్థానంలో నెంబర్ టూగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో రెండు పర్యాయాలు 2004, 2009ల్లో నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి గెలుపొందారు.
2019లో తెనాలి నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో టీడీపీ–జనసేన పొత్తు కుదిరే పక్షంంలో వచ్చే ఎన్నికల్లో తెనాలి సీటును జనసేన పార్టీకి వదిలేయాల్సి ఉంటుంది.
కాగా తెనాలి నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు, కాపు ఓటర్లు సమానంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఈ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఘన విజయం ఖాయం.
ఒకవేళ తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తే.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, గతంలో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు సీటు హుళక్కే అయినట్టే. మరి ఈ నేపథ్యంలో ఆలపాటి రాజాకు ఎక్కడ కేటాయిస్తారో తేలాల్సి ఉంది. మరోవైపు అటు అన్నాబత్తుని శివకుమార్, ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్ ముగ్గురు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే ఆలపాటి రాజా ఎమ్మెల్సీగా అవకాశమివ్వవచ్చని చెబుతున్నారు. లేదా గుంటూరు నుంచి ఎంపీ పదవికి పోటీ చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. లేదా గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజాను బరిలోకి దింపొచ్చని అంటున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి 2019లో టీడీపీ అభ్యర్థి మద్ధాలి గిరిధర్ గెలిచారు. అయితే ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడ టీడీపీకి పార్టీ అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలో ఆ సీటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఇవ్వవచ్చని అంటున్నారు.
మరోవైపు ఆలపాటి రాజా తెనాలి నుంచి బరిలోకి దిగడం ఖాయమైతే నాదెండ్ల మనోహర్ సత్తెనపల్లి నుంచి బరిలో ఉండొచ్చని అంటున్నారు. సత్తెనపల్లిలో కాపు, కమ్మ సామాజికవర్గం ఓటర్లు దాదాపు 80 వేల వరకు ఉన్నారు. జనసేన పార్టీ ప్రభావం ఇక్కడ గట్టిగానే ఉందని అంటున్నారు. మరోవైపు సత్తెనపల్లి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ఉన్నారు. ఈసారి ఆయన అవనిగడ్డ నుంచి పోటీ చేయొచ్చని చెబుతున్నారు. సత్తెనపల్లి నుంచి ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలోకి దిగొచ్చని టాక్ నడుస్తోంది.
మరోవైపు నాదెండ్ల మనోహర్ సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగడం అంత ఈజీ కాదంటున్నారు. ఎందుకంటే బీజేపీ నుంచి జనసేనలోకి రావడానికి కన్నా లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఈపాటికే ఆయన పార్టీలో చేరాల్సి ఉందని.. అయితే బీజేపీ అధిష్టానం మెత్తబరచడంతో కన్నా ఆగారని అంటున్నారు. అయితే ఎన్నికలనాటికి జనసేనలో చేరి సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. మరి అప్పుడు నాదెండ్ల మనోహర్ తెనాలి లేదా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.