Begin typing your search above and press return to search.
జనసేనకు కూడా స్టార్ట్ అయింది... వైసీపీ నుంచి కూడా....?
By: Tupaki Desk | 13 March 2023 8:00 AM GMTఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. దాంతో రాజకీయ పార్టీలు దూకుడు చేస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ నాయకులు కూడా గోడ దూకుళ్ళకు సిద్ధపడుతున్నారు. తాము ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళి సేఫ్ జోన్ లో ఉందామని చూసే వారు ఉన్నారు. నిజానికి రాజకీయం అంటేనే అది. అటు వైపు వారు ఇటు వైపు వస్తే బలం. అలా పెంచుకున్న బలంతో అధికారం సొంతం అవుతుంది.
ఏపీలో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈ మధ్యనే మొదలయ్యాయి. బీజేపీ నుంచి బిగ్ షాట్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీలో చేరారు. దాంతో గుంటూరు జిల్లా టీడీపీలో జోష్ కనిపించింది. అదే విధంగా ఒక బలమైన సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వీలు కలిగిందని ఆ పార్టీ సంతోషించింది. ఇక వైసీపీ కూడా ఈ మధ్యనే కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ అన్న నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ని తెచ్చి తమ పార్టీలో కలుపుకుంది.
ఆయనను ఎమ్మెల్సీగా చేసింది. అదే విధంగా తెలుగుదేశంలోని కొందరు కీలక నాయకులకు వైసీపీ వల వేస్తోంది అని అంటున్నారు. అయితే ఈ రేసులో జనసేన వెనకబడిపోయింది అన్న ప్రచారం అయితే సాగింది. కానీ ఆ పార్టీ కూడా పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ కొంత జోష్ ని నింపుకునేలా చేరికలు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు కి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుతో పాటు, సీనియర్ నేత ప్రకాశం జిల్లాకు చెందిన ఈదర హరిబాబు కూడా జనసేనలో చేరారు.
నిజంగా ఇది జనసేనకు కలసి వచ్చే పరిణామంగానే చెబుతున్నారు. ఈదర తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరారు. ఆయన ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ పట్ల ఆకర్షితుడైన టెడీపీలో చేరారు. అలాగే 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా, 2014లో ప్రకాశం జడ్పీ చైర్మన్ గా వ్యవహరించారు. రాజకీయంగా అనుభవం ఉన్న ఈదర లాంటి వారు జనసేన వైపు రావడం మంచి పరిణామంగానే చూస్తున్నారు.
మరో వైపు చూస్తే కొవ్వూరుకు చెందిన టీవీ రామారావు కూడా టీడీపీ ప్రొడక్ట్ గానే చూడాలి. ఆయన 2009లో కొవ్వూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తరువాత 2014, 2019లలో ఆయనకు టికెట్ రాలేదు. దాంతో ఆయన గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి హోం మంత్రి తానేటి వనిత విజయానికి సహకరించారు.
అయితే వైసీపీలో నాలుగేళ్ళు ఉన్నా ఆయనకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఆయన జనసేనను ఆశ్రయించారు. మొత్తానికి వీరికి కొంత బలం ఉంది పైగా వీరి రాక వల్ల మరింత మంది నాయకులు జనసేన వైపు చూస్తారని పార్టీ వారు అంటున్నారు. ఇంకో వైపు వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తమ వైపునకు వస్తారని జన్సేన ఆశాభావంతో ఉంది.
మరి అధికార పార్టీ వైపు నుంచి వచ్చే వారిని తమ వైపు ఆకర్షించాలని తెఉగుదేశం పార్టీ కూడా సర్వం సిద్ధం చేసుకుని ఎదురుచూస్తోంది. వైసీపీలో దాదాపుగా యాభై నుంచి అరవై మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతున్న నేపధ్యం ఉంది.
దాంతో వారిలో ఎంతమంది టీడీపీలోకి వెళ్తారు, మరేంతమంది జనసేనలోకి వెళ్తారు అన్నది ఇపుడు ఆసక్తికరంగా ఉంది. ఏది ఏమైనా జనసేన ఇపుడు గేట్లు తెరచింది. ఇక క్యూ కట్టే వారు చాలా మంది ఉన్నారని అంటోంది. ఆ విధంగా చేరే వారు ఉన్నారా, ఉంటే ఆ నంబర్ ఎంత అన్న దాని మీదనే జనసేన రాజకీయ అడుగులు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.