Begin typing your search above and press return to search.

ఫాలోవర్స్ లో జుకర్ ను బీట్ చేసిన యూట్యూబర్

By:  Tupaki Desk   |   8 July 2023 10:40 AM GMT
ఫాలోవర్స్ లో జుకర్ ను బీట్ చేసిన యూట్యూబర్
X
ట్విటర్ పిట్టకు పోటీగా వచ్చేసింది ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్స్ కు చెందిన థ్రెడ్స్. ట్విటర్ ను పోలినట్లుగా ఉండే ఈ మైక్రో బాంగ్లింగ్ యాప్ ఎంట్రీలోనే అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. జులై 5న అందరూ డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించటం.. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కోట్లాది మంది ఈ యాప్ ను తమ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేశారు. వీరిలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు.. సెలబ్రిటీలు ఉండటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఈ థ్రెడ్స్ లో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్స్ కు అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు జుకర్ కు 1.8 మిలియన్లు (18 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్నారు.

అయితే.. తాజాగా ఆయన రికార్డును బ్రేక్ చేశాడో యువ కెరటం. ఇంతకూ ఎవరా ప్రముఖుడు అంటే.. అతడో యూట్యూబర్ కావటం గమనార్హం. అమెరికాలో ప్రముఖ యూట్యూబర్ గా పేరున్న బీస్ట్ అలియాస్ జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్ సన్ థ్రెడ్స్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీగా మారారు.

అనూహ్యంగా వ్యవహరిస్తూ.. అవసరమైన వారికి భారీగా విరాళాలు అందించటంతో పాటు.. వినూత్నమైన సవాళ్లను విసిరే ఇతగాడు.. యూట్యూబ్ వీడియోలు చేయటంలో పాపులర్ అయ్యారు. థ్రెడ్స్ లో తన ఖాతాను తెరిచిన అతగాడు.. అతి తక్కువకాలంలో 10 లక్షల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న మొదటి వ్యక్తిగా మారారు.

యూట్యూబర్ గా పాపులర్ అయినప్పటికీ.. మరీ ఇంతలా సామాన్యుల్ని ప్రభావితం చేస్తారా? అన్నట్లుగా ఆయన ప్రొఫైల్ మారింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. థ్రెడ్స్ లో తన ఖాతాను తెరిచారు మార్క్ జుకర్ బర్గ్. అతగాడి ఖాతాను 1.8 మిలియన్ల మంది ఫాలో అవుతుంటే.. బీస్ట్ ను మాత్రం ఏకంగా 2.5 మిలియన్ల మంది ఫాలో కావటం చూస్తే.. యూత్ లో అతగాడికున్న ఫాలోయింగ్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

థ్రెడ్స్ లో మిలియన్ ఫాలోవర్లను ఇన్ స్టా.. నేషనల్ జియోగ్రాఫిక్ లాంటి సంస్థల అధికారిక ఖాతాలకు ఉండగా.. వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీగా ఫాలోవర్లు ఉన్న మొదటి సెలబ్రిటీగా మారారు. రోజుల వ్యవధిలోనే చూస్తుండగానే 30 మిలియన్ల (3 కోట్ల) యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవటం చూస్తే.. రానున్న రోజుల్లో దీని జోరు మరింత పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.