Begin typing your search above and press return to search.
అలా జరుగుతాయంతే.. వైద్యులను వెనకేసుకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 21 April 2023 8:00 PM GMTఇటీవల జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ కడుపులో గుడ్డ ఉంచి కుట్లు వేశారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. అయితే ఈ ఘటనను మీడియా హైలెట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తప్పుపట్టారు. అప్పుడప్పుడు వైద్యం వికటించడం సహజమని.. డాక్టర్లే కాకుండా సిబ్బంది వల్ల కూడా తప్పు జరగొచ్చంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. స్వయంగా డాక్టర్ అయిన సంజయ్ కుమార్ కు కంటివైద్యంలో మంచి పేరుంది. డాక్టర్లు, చికిత్స గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్,.. ఒకటి రెండు సంఘటనల వల్ల ప్రబుత్వాసుపత్రుల పట్ల అభిప్రాయాన్ని చెడుగా మార్చుకోవద్దంటూ కోరారు.
మహిళ కడుపులో గుడ్డ మరిచిపోయిన ఘటన కిందిస్థాయి సిబ్బంది చేసిన పొరపాటు. దానికి వైద్య వ్యవస్థ మొత్తాన్ని నిందించవచ్చు. డాక్టర్లు, నర్సుల సమిష్టి బాధ్యతతో ఆపరేషన్లు జరుగుతాయని.. ప్రభుత్వాసుపత్రులపై నమ్మకంతో రండి.. మాతా శిశు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
స్వతహాగా డాక్టర్ కావడంతోనే బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ కామెంట్స్ చేశారన్న ప్రచారం సాగుతోంది. అయితే తప్పు చేయవచ్చు అనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇటీవల జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళ 16 నెలల క్రితం జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేసుకుంది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం వివాదాస్పదమైంది.
ఏడాది తర్వాత తీవ్ర కడుపునొప్పి రావడంతో నవ్యశ్రీ వేములవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చెక్ చేయించుకోగా స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి బట్టను తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల డీఎంహెచ్ఓకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.