Begin typing your search above and press return to search.

కేసీఆర్.. ఇవ్వకుంటే పోరాటం చేస్తా: జగ్గారెడ్డి

By:  Tupaki Desk   |   31 Dec 2020 10:32 AM GMT
కేసీఆర్.. ఇవ్వకుంటే పోరాటం చేస్తా: జగ్గారెడ్డి
X
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్లు పీసీసీ పీఠం కోసం ఫైట్ చేసిన జగ్గారెడ్డి తాజాగా తన సంగారెడ్డిలోని పెండింగ్ హామీలపై ప్రెస్ మీట్ పెట్టాడు.

సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు అవుతోందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు.

2015లో సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రతిపాదనను సిద్దిపేటకు తీసుకెళ్లారని జగ్గారెడ్డి విమర్శించారు. గత ఎన్నికల సమయంలో మెడికల్ కాలేజీ ఇస్తామని మాటిచ్చి.. అసెంబ్లీలో కూడా చెప్పారని అన్నారు.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మెడికల్ కాలేజీ గురించి కేంద్రం వద్ద ప్రస్తావించి ఉంటే బాగుండేదని అన్నారు. మెడికల్ కాలేజీ విషయాన్ని సీఎం మర్చిపోయారని.. అందుకే తాను గుర్తు చేస్తున్నానని అన్నారు.

కాలేజీ ఇస్తే చాలని.. క్రెడిట్ మీరే తీసుకోండని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కేటాయిస్తే చాలని అన్నారు. మెడికల్ కాలేజీ అంశంపై జనవరి వరకు చూస్తానని, అప్పటికీ సీఎం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే ఫిబ్రవరి నుంచి పోరాటం చేస్తానని అన్నారు.