Begin typing your search above and press return to search.
గుర్మీత్ కు శిక్ష వేసిన జడ్జి మామూలోడు కాదు
By: Tupaki Desk | 26 Aug 2017 4:21 AM GMTదేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నారు బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. ఇద్దరు సాద్వీలను అత్యాచారం చేసిన ఘటనలో దోషిగా ఆయన్ను తేల్చి చెబుతూ పంచకుల సీబీఐ న్యాయస్థానం తీర్పు చెప్పిన అనంతరం పంజాబ్.. హర్యానా రాష్ట్రాలు ఆందోళనలతో.. హింసతో అట్టుడిగిపోవటం తెలిసిందే.
ఈ తీర్పు అనంతరం జరిగిన అల్లర్లలో పలువురు అమాయకులు మరణించారు. అంతకంతకూ పెరుగుతున్న హింసను కంట్రోల్ చేయటానికి రాష్ట్రపతి.. ప్రధానితో సహా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా ప్రజల్ని శాంతంగా ఉండాలని కోరటం చూస్తే.. గుర్మీత్ కేసును హ్యాండిల్ చేయటం ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది.
రెండు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నగుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను కేసుకు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది చూస్తే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. గుర్మీత్ ను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చిన జపంచకుల సీబీఐ కోర్టు జడ్జి పేరు జగ్దీప్ సింగ్. 2000లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద విద్యను పూర్తి చేసిన ఆయన.. చదువుకునే రోజుల్లోనే అనితర ప్రతిభను ప్రదర్శించినట్లుగా చెబుతారు. హైకోర్టులో రెండేళ్ల లాయర్ ప్రాక్టీస్ తర్వాత 2012లో హర్యానా జ్యూడిషియల్ సర్వీస్ కు ఎంపికయ్యారు.
జిల్లా అదనపు జడ్జిగా సోనేపట్ లో మొదట నియమితులైన ఆయన.. గత ఏడాదే సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అన్ని అంశాల్ని అధ్యయనం చేసిన తర్వాతనే తీర్పు ఇస్తారన్న పేరు ఆయనకుంది. మామూలు న్యాయమూర్తికి.. సీబీఐ న్యాయమూర్తి నియామకం భిన్నంగా ఉంటుందని చెబుతారు. సంబంధిత హైకోర్టు నియామకాన్ని పూర్తి చేస్తుంది.
కీలక పదవిలో ఉన్నా సాదాసీదాగా ఉండేందుకే ఆయన ఇష్టపడతారని చెబుతారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదన్న విషయాన్ని చెప్పేందుకు ఇటీవల చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని చెప్పొచ్చు. గత ఏడాది పంచకుల రహదాడిపై ఆయన వస్తున్నప్పుడు ట్రాఫిక్ నిలిచిపోయంది. ఎందుకలా అన్న ఆరా తీయగా.. రోడ్డు ప్రమాదం జరిగిందని కొందరు చెప్పటంతో స్పందించిన ఆయన వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు.
అక్కడ నుంచి అంబులెన్స్ కు ఫోన్ చేసి.. త్వరగా రమ్మని కోరితే అంబులెన్స్ కు రెక్కలు ఉంటాయా? అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో.. మరింకేమీ ఆలోచించకుండా బాధితుడ్ని తన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందేలా చూశారు.