Begin typing your search above and press return to search.

నాన్న మీద ఆన... నంద్యాల నాదే అంటున్న భూమా వారసుడు

By:  Tupaki Desk   |   7 April 2023 5:00 PM GMT
నాన్న మీద ఆన... నంద్యాల నాదే అంటున్న భూమా వారసుడు
X
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో భూమా నాగిరెడ్డిది ఒక హిస్టరీ. ఆయన దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు తన కనుసన్నలలో జిల్లా రాజకీయాలను శాసించారు.ప్రత్యేకించి నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఆయన ఆధిపత్యం గట్టిగానే ఉంది. ఆయన నంద్యాల ఎంపీగా కూడా పనిచేశారు. ఆళ్ళగడ్డ, నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు వెలితి ఏమైనా ఉంది అంటే మంత్రి కాలేకపోయాను అన్నదే.

ఇక ఆయన సతీమణి శోభా నాగిరెడ్డికి ఆళ్లగడ్డను అప్పగించి ఆయన నంద్యాలను తీసుకున్నారు. అలా శోభా నాగిరెడ్డి మరణానంతరం వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చారు. కుమార్తె అఖిలప్రియకు ఆళ్ళగడ్డ అప్ప్గించి తాను నంద్యాల చూశారు. ఇక భూమా నాగిరెడ్డి 2017 మార్చిలో మరణించారు. ఆయన సీటుకు అప్పట్లో ఉప ఎన్నికలు జరిగితే భూమా ఫ్యామిలీకే చెందిన బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి గెలిచారు. బ్రహ్మానందరెడ్డి అఖిలప్రియకు కజిన్ బ్రదర్ అవుతారు

ఇక 2019లోనూ ఆ సీటులో బ్రహ్మాందందరెడ్డి పోటీ చేసినా ఓడారు. 2024 ఎన్నికల్లో మూడవసారి ఆ సీటు తనకే టీడీపీ కేటాయిస్తుందని ఆయన భావిస్తున్నారు. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ ఇపుడు ఫుల్ అలెర్ట్ అయింది. తండ్రి చనిపోయేనాటికి చిన్నవాడు అయిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఇపుడు పెద్ద వాడు అయ్యాడు. ఆయన తన తండ్రి పోటీ చేసి గెలిచిన నంద్యాల ఎమ్మెల్యే సీటు కోరుకుంటున్నారు.

దాని కోసం అక్క అఖిలప్రియ కూడా సపోర్ట్ గా ఉంది. భూమా నాగిరెడ్డి రాజకీయ వారసత్వం పూర్తిగా అక్కా తమ్ముళ్ళు పంచుకోవాలని చూస్తున్నారు. మధ్యలో వచ్చిన కజిన్ బ్రదర్ బ్రహ్మానందరెడ్డికి ఎసరు పెట్టేలాగానే పాలిటిక్స్ సాగుతోంది. ఇలా భూమా ఫ్యామిలీలో విభేదాలు రావడంతోనే టీడీపీ అధినాయకత్వం కూడా ఏమి చేయాలో తెలియక ఆలోచిసోందని అంటున్నారు.

తాజాగా నంద్యాలలో పర్యటించిన భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి నంద్యాల నాన్న సీటు, ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే మరణించారు, కాబట్టి తాను కూడా ఇక్కడ నుంచే పోటీ చేసి గెలవాలని ఉందని చెప్పి సంచలనం రేకెత్తించారు. టికెట్ రేసులో నేనూ ఉన్నాను అని జగన్ విఖ్యాత్ రెడ్డి చేసిన బిగ్ సౌండ్ తో స్వపక్షంలోనూ విపక్షంలో చర్చ మొదలైంది.

నాన్న అడుగు జడలలలో నడవాలని చూస్తున్నాను అని ఆయన అంటున్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఇటు యూత్ తో పాటు అటు మాస్ అని అట్రాక్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీకి కూడా ఆయన సవాల్ చేస్తున్నారు. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీలోకి వస్తారు అన్న ప్రచారం ఉన్న నేపధ్యంలో ఆయన కనుక రావాలీ అంటుకుంటే చంద్రబాబు, లోకేష్ బాబులను అన్న మాటలకు క్షమాపణలు చెప్పి కాళ్ళు పట్టుకుని వస్తేనే అపుడు ఆలోచిస్తామని అంటున్నారు.

అంతే కాదు టీడీపీ కార్యకర్తల మీద అక్రమంగా పెట్టిన కేసులతో నానా ఇబ్బందులు పడిన క్యాడర్ కి క్షమాపణలు చెప్పాలని కూడా కొత్త డిమాండ్ చేశారు. మొత్తానికి చూస్తే అక్క చాటు తమ్ముడిగా ఇన్నాళ్ళూ ఉంటూ వచ్చిన జగత్ విఖ్యాత్ రెడ్డి ఇపుడు స్టైల్ మార్చేశారు. అచ్చం భూమా నాగిరెడ్డిని పోలిన రూపంతో పాటు సీమ యూత్ ని ఆకట్టుకునే దూకుడుతో జోరు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల టికెట్ తో బరిలోకి దిగి నాగిరెడ్డి రుణం తీర్చుకుంటాను అంటున్న ఈ యువనేతకు బాబు టికెట్ ఇస్తారా లేదా అన్నదే చర్చగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.