Begin typing your search above and press return to search.
రజనీ కాంత్ ఎపుడూ నిజాలే చెబుతారు !
By: Tupaki Desk | 3 May 2023 6:57 PM GMTతమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఎపుడూ నిజాలే చెబుతారు అని టాలీవుడ్ నటుడు జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ మాట్లాడితే అది కచ్చితంగా వాస్తవమే అయి ఉంటుందని ఆయన అంటున్నారు. రామబాణణం మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగపతిబాబు ఈ కామెంట్స్ చేశారు.
ఇటీవల విజయవాడ వచ్చిన రజనీకాంత్ ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుని పొగుడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దాని మీద వైసీపీ మంత్రులు మాజీ మంత్రులు ఇతర సీనియర్ నాయకులు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. అది కాస్తా రాజకీయ దుమారంగా మారింది.
ఇక సినీ నటుడు అయిన రజనీకాంత్ కి టాలీవుడ్ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు అని ఇంతదాకా అంతా భావించారు. తొలిసారి టాలీవుడ్ లో హీరో కం విలన్ అయిన జగపతిబాబు రజనీకాంత్ గురించి కీలక కామెంట్స్ చేయడం విశేషం. రజనీని పెర్ఫెక్ట్ అని జగపతిబాబు కొనియాడారు. ఆయన అబద్ధాలు మాట్లాడేది ఉండదని అన్నారు.
ఇక జగపతిబాబు మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ రజనీకాంత్ గురించి అయితే తాను ఆయన మంచి మనిషి అని చెప్పగలను అంటున్నారు. రాజకీయ రచ్చ గురించి ఆ గొడవల గురించి తనకు తెలియదు అని ఆయన అన్నారు. పద్ధతిగా రజనీ మాట్లాడుతారు అన్నది మాత్రం తనకు తెలుసు అన్నరు. రజనీని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు అన్న దాని మీద ఆయన రియాక్ట్ అవుతూ మాట్లాడే వారు అలా మాట్లాడుతూనే ఉంటారని, వాటిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని అన్నారు.
రజనీ మనసులో ఏదీ దాచుకోరని, లోపల ఏది అనుకుంటారో అది బయటకు నిర్భీతిగా చెబుతారు అని జగపతిబాబు అంటున్నారు. రజనీకాంత్ సెంట్ పెర్సెంట్ నిజాలు మాట్లాడుతారు అంటూ జగ్గూభాయి చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి చూస్తే రజనీకాంత్ ని వైసీపీ నేతలు టార్గెట్ చేసి అంటున్న మాటలకు జగ్గూభాయి నుంచి ఇంటెరెస్టింగ్ కౌంటరే వచ్చింది అని అంటున్నారు.