Begin typing your search above and press return to search.

జగన్ వర్సెస్ పవన్... బాబు ఫుల్ ఖుషీ !

By:  Tupaki Desk   |   28 Jun 2023 9:13 PM GMT
జగన్ వర్సెస్ పవన్... బాబు ఫుల్ ఖుషీ !
X
పవన్ని ఎలా హ్యాండిల్ చేయా లో వైసీపీ కి తెలియదు, టీడీపీ కి బాగా తెలుసు. అందుకే పవన్ తమ ప్రభుత్వం మీద 2017 తరువాత హాట్ కామెంట్స్ ఎన్ని చేసినా ఇంకా గట్టిగా చెప్పాలంటే నాటి సీఎం చంద్రబాబు మీద ఆయన కుమారుడు మంత్రి లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేసినా వైసీపీ చాలా స్మూత్ గా డీల్ చేసుకొచ్చింది. పవన్ సీరియస్ అలిగేషన్స్ చేసినా లైట్ తీసుకుంటూ జనం లో చర్చకు రాకుండా చూసుకుంది.

ఇపుడు అధికారం లో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద పవన్ గట్టి గానే కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆయన పాత్ర కూడా అదే విపక్ష నేతగా ఆయన లోపాలే చెబుతారు. జగన్ అన్నా మరొకరు అన్నా ప్రభుత్వం చేసే మంచి గురించి ఆయన ఎందుకు చెబుతారు. రాజకీయాల్లో అందునా వర్తమానంలో విపక్షాలు అధికార పార్టీ ఫెయిల్యూస్ నే ఎక్కువగా చూస్తూ ఉంటాయి.

అందువల్ల మేము చేసే మంచి విపక్షాల కు కనిపించడంలేదా అని జగన్ అన్నా ఎవరన్నా అది ఉపయోగం లేని విషయమే. ఇదిలా ఉంటే పవన్ అంటూ గట్టిగా వైసీపీ ఫోకస్ చేయడం వల్లనే ఈ పరిస్థితి అని అంటున్నారు. పవన్ని ఒక వ్యక్తిగా సినీ నటుడిగా మాత్రమే వైసీపీ చూస్తోంది. కానీ ఆయన చుట్టూ ఒక బలమైన సామాజికవర్గం ఉందని ఆ వర్గం వెనక దశాబ్దాల నాటి తీరని ఒక బలీయమైన రాజకీయ ఆకాంక్ష ఉందన్న సంగతి ని వైసీపీ విస్మరిస్తోంది.

దీని వల్లనే పవన్ని ఎంత అంటే అంతలా ఆయన వెనక ఆ సామాజికవర్గం గట్టిగా నిలబడుతోంది. అంతకంతకు అలా పవన్ బలపడుతూంటే అది వైసీపీ కి మైనస్ అవుతోంది అని అంటున్నారు. ఇక్కడ చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని మెచ్చుకోవాలి. ఆయన పవన్ని రాజకీయ శక్తిగానే చూస్తున్నారు.

పవన్ తన చరిష్మాను ఎంతవరకూ తన కోసం వాడుకుంటారు అన్నది పక్కన పెడితే ఆయన విషయం లో నాడూ నేడూ కూడా సాటి రాజకీయ పక్షంగా టీడీపీ ఎపుడూ ఎదురు పడలేదు. అలా ఆయనకు ఎదురెళ్ళాలని కూడా చూడడంలేదు. అందుకే కాపుల లో టీడీపీ పట్ల నెగిటివిటీ పెరగడలేదు. వారి ఓట్లు వారికి అలా ఉన్నాయి. కానీ వైసీపీ కి కాపుల మద్దతు ఉంది. ఓట్లు ఉన్నాయి.

కానీ పవన్ని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ అంతకంతకు లాస్ అవుతోందా అన్నదే చర్చకు వస్తోంది. మరో వైపు చూస్తే ఏపీ లో రేపటి రాజకీయానికి ప్రతీకలు పవన్ జగన్. ఈ ఇద్దరిదే రేపటి పాలిటిక్స్ లో ఎంతో చాన్స్ ఉంది. చంద్రబాబు కు ఇవి దాదాపుగా చివరి ఎన్నికలు. ఆయన రాజకీయ వారసుడి గా లోకేష్ యువగళం తో ఇపుడిపుడే ఎదుగుతున్నారు.

అయినా సరే పవన్ జగన్ ఇమేజ్ ఆయనకు దక్కడం అంటే ఇప్పటికిపుడు కష్టం. ఇక ఏపీ లో ట్రయాంగిల్ ఫైట్ అన్నది 2024లో కనిపించకపోయినా కచ్చితంగా ఉంటుంది. ఈ పోరు లో ఒక పార్టీ ఎలిమినేట్ అయితేనే రెండు పార్టీల వ్యవస్థ ఉంటుంది. టీడీపీకి లోకేష్ కి మంచి ఫ్యూచర్ ఉంటుంది.

అయితే 2024లోనే ఏపీ లో ట్రయాంగిల్ జరిగితే మాత్రం జగన్ పవన్ మాత్రమే మిగులుతారు. అలా కాకుండా ఉండాలంటే ఈ ఇద్దరి మధ్యనే బిగ్ ఫైట్ జరగాలి. అందుకే టీడీపీ ఏపీ పాలిటిక్స్ లో ఇపుడు సైలెంట్ అయింది అనుకున్నట్లుగా జగన్ వర్సెస్ పవన్ గా కధ సాగుతోంది.

జగన్ని నిందించి పవన్ ఒక బలమైన సామాజికవర్గానికి దూరం అవుతూంటే పవన్ని టార్గెట్ చేస్తూ జగన్ అలాగే అవుతున్నారా అన్నదే చర్చ. ఈ మొత్తం ఎపిసోడ్ ని చూసుకున్నపుడు టీడీపీ అయితే సేఫ్ జోన్ లో ఉంది అని అంటున్నారు. మొత్తంగా ఇలాంటి రాజకీయ పరిణామాలనే టీడీపీ కోరుకుంటుందా అంటే అదే నిజం అంటున్నారు. దానికి తగినట్లుగానే పరిణామలు చకచకా సాగుతున్నాయి. మరి 2024లో జనం ఇచ్చే తీర్పును బట్టి టీడీపీ అనుకున్న వ్యూహం సక్సెస్ అయిందా లేదా అన్నది తెలుస్తుంది.