Begin typing your search above and press return to search.
సీఎం జగన్ కు ఆ స్వాములోరు ఇచ్చిన సలహాలేమిటి?
By: Tupaki Desk | 18 Feb 2021 11:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి మధ్యనున్న దగ్గరితనం అందరికి తెలిసిందే. ఆయన అన్నా.. ఆయన మాటలకు ముఖ్యమంత్రి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ కారణంగానే ఈ స్వాములోరు విశాఖ నుంచి ఎక్కడికైనా వెళుతున్నా.. ఎక్కడ నుంచైనా నగరానికి వస్తున్నా.. ఆయనకు విశాఖ పోలీసులు కల్పించే భద్రత.. ఇచ్చే ప్రాధాన్యత విశాఖ వాసులు తరచూ మాట్లాడుకుంటుంటారు. అలాంటి ఆయన నిర్వహించే శారదాపీఠం వార్షికోత్సవాలు ఆరంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు.
హిందూ ధార్మిక పరిషత్ కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని.. స్వరూపానందేంద్ర సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తాజా భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరలోనే ధార్మిక పరిషత్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవటం మంచిదని ముఖ్యమంత్రికి స్వామీజీ సలహా ఇచ్చారు. ఇటీవల కాలంలో ఏపీలో వరుసగా జరిగిన దేవాలయాల విధ్వంసంపైనా చర్చ జరిగింది. స్వాములోరు ఇచ్చిన సూచనలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది.
తాజా భేటీలో సీఎం జగన్ కు స్వాములోరు ఇచ్చిన మరికొన్ని సలహాలు ఏమంటే..
- దేవాదాయ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలపై దేవాదాయ శాఖ తరపున తొందర్లోనే పీఠాధిపతుల సమావేశాన్ని నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
- వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వారసత్వ అర్చకత్వం విషయంలో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, అయితే అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి.
- త్వరలోనే హిందూ ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయాలి.