Begin typing your search above and press return to search.

రెండేళ్లు వెయిట్ చేయమంటున్న జగన్

By:  Tupaki Desk   |   27 Feb 2016 5:22 AM GMT
రెండేళ్లు వెయిట్ చేయమంటున్న జగన్
X
ఆశకు మించింది లేదు. చేసేందుకు ఏమీ లేని పరిస్థితుల్లో భవిష్యత్తు మీద ఆశ మాత్రమే మిగిలినట్లుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో నిరాశ.. నిస్పృహతో నిండిన నేతలు.. కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన ధైర్య వచనాలు చెబుతున్నారు. అందరూ ధైర్యం ఉండమంటున్న ఆయన.. రెండేళ్లు వెయిట్ చేస్తే చాలు.. పరిస్థితి మొత్తం మారిపోతుందని నమ్మకంగా చెబుతున్నారు. శుక్రవారం తనను కలిసిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు.. కార్యకర్తల్ని ఉద్దేశించి జగన్ చెప్పిన మాటల్ని ఆయన మాటల్లోనే వింటే.. ఫ్యూచర్ మీద జగన్ బాబు ఎన్ని ఆశలు పెట్టుకున్నది అర్థమవుతుంది.

= మరో రెండేళ్లు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండండి. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చూసి అధికారులు.. పోలీసుల్లో కూడా మార్పు వస్తుంది. అప్పుడు వాళ్లు మన మాటే వింటారు.

= ఒకట్రెండు ఏళ్లు మీరు కానీ ఓపిక పడితే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. మరో ఏడాదిలో పరిస్థితి పూర్తిగా తారుమారు అవుతుంది.

= ఇన్నాళ్లు మా కుటుంబానికి వెన్నెంటే ఉన్న మీరు.. ఒకట్రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తే చాలు కష్టాలు తీరిపోతాయి.

= మన ప్రభుత్వం వచ్చినప్పుడు మిమ్మల్ని పేరు పేరునా గుర్తు పెట్టుకుంటా.

= సొంత జిల్లాలోనే తలనొప్పులు తెస్తే ఇబ్బంది ఉంటుంది. అందుకే అందరిని వెంట ఉండమంటున్నా.

= దేనికి భయపడొద్దు.. మీకు నేనున్నా.

= అక్రమ కేసుల గురించి భయపడొద్దు.. మంచి రోజులు త్వరలోనే వచ్చేస్తాయి.