Begin typing your search above and press return to search.

ఉగాది నుంచి.. వలంటీర్లకు జగన్ గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   12 Feb 2021 5:40 AM GMT
ఉగాది నుంచి.. వలంటీర్లకు జగన్ గుడ్ న్యూస్
X
ఏపీలో జీతాలు పెంచాలంటూ రోడ్డెక్కిన గ్రామ, వార్డు వలంటీర్ల మొరను ఏపీ సీఎం జగన్ ఆలకించారు. వారికి జీతాలు పెంచాలంటూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎం జగన్ స్పందించి తాజాగా వారికి లేఖ రాశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఉగాది నుంచి అన్ని నియోజకవర్గాల్లోని వలంటీర్లను సత్కరించాలని.. వారికి సేవారత్న, సేవా మిత్ర లాంటి బిరుదులు ఇవ్వాలని జగన్ సూచించారు. ఇలా చేయడం ద్వారా వారి సేవలను గుర్తించి ప్రోత్సహించినట్టు అవుతుందన్నారు. వలంటీర్లకు రివార్డులు కూడా ఇవ్ాలన్నారు. ఇలా చేస్తే సేవా దృక్పథంతో పనిచేస్తారని జగన్ వ్యాఖ్యానించారు.

ఈ సత్కార కార్యక్రమంలో కలెక్టర్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని జగన్ ఆదేశించారు. వేతనాల కోసం రోడ్డెక్కిన వలంటర్లను చూసి బాధ కలిగిందన్నారు. వలంటీర్లను సేవ కోసం ఏర్పాటు చేశామన్నారు. వలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా చేసే పని అని.. ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం మొత్తం వ్యవస్థనే నీరుగారుస్తుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో మార్గంలో వలంటీర్లను ప్రోత్సహిస్తామన్నారు. వచ్చే ఉగాది నుంచి వలంటీర్లను తాము సన్మానిస్తామన్నారు.

వేతనాలు పెంచాలని వాలంటీర్లు రోడ్డెక్కడం చూసి చాలా బాధ కలిగిందని జగన్ అన్నారు.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ఎందుకు ఏర్పాటు చేశామో తెలుసు కదా అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమేనని.. వాలంటీర్‌ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధమన్నారు. సచివాలయ వ్యవస్థను సొంతం చేసుకోవాలని సీఎం సూచించారు.