Begin typing your search above and press return to search.
టీడీపీ విషయంలో జగన్ మొదటి టార్గెట్ ఇదేనట
By: Tupaki Desk | 5 Jun 2019 3:45 PM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే తన మార్క్ చూపిస్తున్నారు. ముందుగా అధికార - నామినేటెడ్ పదవులను ప్రక్షాళన చేసే విధంగా ఆయన పావులు కదుపుతున్నారు. అదే సమయంలో మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు కూడా దాదాపుగా పూర్తి చేసేశారు. ఈ నెల 8న మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం పెట్టుకున్న నేపథ్యంలో విమర్శలకు తావులేని కేబినెట్ రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందడుగు వేస్తున్నారు. దీనితో పాటు నాలుగు రోజులుగా పలు శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను వారిని అడిగి తెలుసుకుంటున్నారు. జగన్ ఇంతలా బిజీ అయిపోవడం వెనుక బలమైన కారణం ఉందట.
ఒకే సమయంలో ముఖ్యమంత్రిగా - పార్టీ అధ్యక్షుడిగా పనులు చక్కబెడుతున్న జగన్ మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారని తెలుస్తోంది. ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ కొద్దిరోజుల విరామం తర్వాత ప్రజా సమస్యలను లేవనెత్తి హైలైట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇదే జరిగితే వైసీపీ ప్రభుత్వానికి ఆదిలోనే భారీ నష్టం చేకూరుతుంది. ఇలా జరిగితే ప్రమాణ స్వీకారానికి ముందు తన పనితీరును చూపిస్తానని మాటిచ్చిన జగన్ పై ప్రజలకు నమ్మకం పోతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకునేందుకే ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అందుకే అన్ని శాఖల నుంచి సమాచారాన్ని సేకరించి - త్వరలోనే ప్రజా సంక్షేమాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇదే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారని వినికిడి.
వాస్తవానికి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలు - అభివృద్ధి పనులు - ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలను ఎత్తి చూపడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. రాజధాని భూముల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా ఉందటే అది వైసీపీ చేసిన పోరాటమే. ఇక, అన్నింటి కంటే ముఖ్యమైన ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కూడా జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవలంభించిన తీరుకు మంచి మార్కులే పడ్డాయి. మొదటి నుంచీ ఒకే స్టాండ్ మీద ఉండడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దీనికితోడు జగన్ చేసిన ప్రజాసంకల్పయాత్ర వైసీపీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. వీటన్నింటి ఫలితమే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.