Begin typing your search above and press return to search.
బిల్లులన్నీ నిలిపేసిన జగన్.. కారణమిదే..!
By: Tupaki Desk | 4 Sep 2019 11:30 AM GMTఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉద్యోగుల జీతాలు మినహా ఇతర బిల్లులను నిలిపివేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం సంచలనంగా మారింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. చంద్రబాబు హయాం నుంచి పెండింగ్ బిల్లులు ఉండడం.. ప్రస్తుత ప్రభుత్వానికి అవి గుదిబండగా మారడం..నవరత్నాల అమలు.. వెరిసి ఆర్థిక లోటు మాంద్యంతో జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
తాజాగా ట్రెజరీ - పీఏఓ కార్యాలయాల్లో బిల్లులు చెల్లించాలని పెద్ద ఎత్తున దరఖాస్తులున్నాయని కలెక్టర్లు ప్రభుత్వానికి విన్నవించారు. గత మే నెల నుంచి ఎన్నికల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అద్దెకు తీసుకున్న కార్ల బకాయిలు కూడా చెల్లించలేదని కోరారట.. దీనిపై క్యాబ్ ఓనర్స్ ఆందోళన చేస్తున్నారని.. ఒక్కో కారుకు రూ.60వేలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని వివరించారట.. ఈ బిల్లులను చెల్లించేందుకు నిధులను ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు తాజాగా ప్రభుత్వాన్ని కోరారు.
అయితే పథకాల అమలు - ఇతర ప్రాజెక్టు వ్యయాల కారణంగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఆదాయానికి - ఖర్చుకు మధ్య తేడా ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి అత్యవసర బిల్లులు చెల్లించేందుకు వీలుగానే బిల్లులన్నీ నిలిపివేయాలని ప్రభుత్వం కలెక్టర్లను కోరినట్టు తెలిసింది.
కేవలం వేతనాలు - పెన్షన్లు మాత్రమే ముందుగా చెల్లించాలని తర్వాత కార్ల అద్దె సహా మిగతా వాటిని చెల్లించాలని కోరింది. టీడీపీ హయాం నుంచే ఈ అద్దెలు ఉన్నట్టు కూడా కొందరు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు తెలిసింది.