Begin typing your search above and press return to search.

నేను ఓడేది లేదంతే...జగన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   22 May 2023 3:25 PM GMT
నేను ఓడేది లేదంతే...జగన్ సంచలన వ్యాఖ్యలు
X
బందరు పోర్టుకు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్థానికంగా జరిగినసభలో మాట్లాడుతూ చంద్రబాబు అండ్ కో ని గట్టిగా టార్గెట్ చేశారు. చంద్రబాబు పొత్తులతో ఎత్తులతో వస్తున్నారని, తన వెంట మరికొన్ని పార్టీలను కలుపుకుని మరీ నా మీద యుద్ధానికి సిద్ధమవుతున్నారని జగన్ అంటున్నారు. ఎంత మంది వచ్చినా రానీయండి, ప్రతీ కుటుంబానికి మంచి చేసి పేదలను పెద్దలుగా చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న నన్ను ఓడించలేరు అని జగన్ స్పష్టం చేశారు.

ప్రతీ ఇంటిలో ప్రతీ కుటుంబంలో నేను చేసిన మంచి ఉందని, అంతా కలసి తన వెనక సైన్యంగా ఉన్నారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. వీరంతా ఏకమైతే నేను ఓడుతానని భావిస్తున్నారని, కానీ రెండు లక్షల పది వేల కోట్ల రూపాయల నగదు బదిలీతో అందరికీ మేలు చేశాను, అందుకే అంతా తనకు అండగా ఉంటారని జగన్ గట్టిగా చెప్పుకున్నారు

ఇక చంద్రబాబుకు ఆయన తోడు ఉన్న పార్టీలకు పేదలంటే వారికి పడదు, వారంటే చులకన భావం ఉంది. పేదల పాలిట ద్రోహులు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాంటి వారి మీద తాను యుద్ధం చేస్తున్నాను అని అన్నారు. పేదలకు సెంట్ స్థలం ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు.

తాను అమరావతిలో పేదలకు ఇళ్లను ఇవ్వాలనుకుంటే కోర్టులకు వెళ్ళి మరీ అడ్డంకులు సృష్టించారని జగన్ మండిపడ్డారు. ఏకంగా యాభై వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే రాక్షసుల మాదిరిగా అడ్డుకుటున్నారని జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థలు దత్తపుత్రుడు కలసి పేదలను ఏ మేలు చేయకూడదని అడ్డుకుంటున్నారని జగన్ కామెంట్స్ చేశారు.

అయినా తాను ఈ నెల 26న అమరావతిలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లుగా చెప్పారు. ఇదంతా తన సంకల్పంతోనే సాధ్యపడిందని అన్నారు. అమరావతిలో సామాజిక అన్యాయన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని, దాన్ని తాను సరిచేస్తున్నాను అని జగన్ చెప్పుకొచ్చారు.

అంటరాని తనం కొత్త రూపుగా చంద్రబాబు మారారని అన్నారు. ఆయన పేదల పట్ల కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెత్తందార్లకు ప్రతీక చంద్రబాబు అని జగన్ ఘాటు వ్యాక్యలు చేశారు.

బీసీల తోకలను కత్తిరిస్తామని నాడు చంద్రబాబు చేసిన కామెంట్స్ ని కూడా జగన్ గుర్తుకు తెచ్చారు. అదే విధంగా పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలను ఆయన సమాధులతో పోల్చారంటే ఆయన పేద్ల వ్యతిరేక భావజాలాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు పేదలకు ఏమి మంచి చేశారని, ఓట్లు అడగలరని జగన్ ప్రశ్నించారు. పేదలకు చేసే ప్రతీ కార్యక్రమం అడ్డుకుంటున్న బాబు కంటే ద్రోహి మరొకరు ఉండబోరని జగన్ మండిపడ్డారు

బందరు పోర్టు విషయంలోనూ అదే చేస్తూ వచ్చారని, కోర్టులలో కేసులు వేసి ఎన్నో ఇబ్బందులు కలిగించారని, నాలుగేళ్లుగా అనేక చిక్కు ముళ్ళు విప్పుకుంటూ వచ్చామని, ఇపుడు బందరు పోస్టుకు శంకుస్థాపన చేశామని అన్నారు. క్రిష్ణా జిల్లాకు బందరు పోర్టుతో మహర్దశ వచ్చిందని జగన్ అన్నారు.

బందరు పోర్టు కల సాకారం కాకుండా చంద్రబాబు తన బినామీలను ముందు పెట్టి భూములను వేల ఎకరాలను కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు. అయినా సరే వాటిని అధిగమించి అన్ని అనుమతులు పోర్టుకు తీసుకుని వచ్చామని, పోర్టు పూర్తితో స్థానికంగా పాతిక వేల దాకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని జగన్ చెప్పారు.

పోర్టుని 35.12 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణం చేపడుతున్నామని, వ్యాపార రాణిజ్య రంగంగా బందరు ఇక మీదట నిలుస్తుందని, అదే విధంగా ఈ పోర్టు ద్వారా అటు చత్తీస్ ఘడ్,ఇటు తెలంగాణాలకు మేలు జరుగుతుందని జగన్ పేర్కొన్నారు.