Begin typing your search above and press return to search.
విడాకులిచ్చి ఇప్పుడు కొత్త పెళ్లికి బాబు రెడీ..జగన్
By: Tupaki Desk | 24 May 2018 4:49 AM GMTచంద్రబాబు ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకొని మరో పెళ్లికి రెడీ అవుతున్నాడని..’ వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు.. కర్ణాటకలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు పాల్గొన్న తీరును జగన్ ఎండగట్టారు.. చంద్రబాబు అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయనేదానిపై ఉదాహరణలతో సహా జగన్ వివరించారు. తిరుపతిలో ధర్మపోరాట దీక్ష పేరు చేసిన ప్రసంగంలో స్వాతంత్ర్యం కోసం పోరాడింది తెలుగు దేశం పార్టీ అని చెబుతున్నాడని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఇదే పెద్దమనిషి ఉండి ఉంటే ప్యాకేజీ తీసుకొని బ్రిటీష్ వారితో లాలూచీ పడేవాడని విమర్శించారు.
*ఎండలు తగ్గించాలని సూర్యుడికి ఆదేశాలా.?
దేశం - రాష్ట్రంలో ఏదీ జరిగినా తనదే క్రెడిట్ అని చెప్పుకునే యావ చంద్రబాబులో ఎక్కువైందని జగన్ విమర్శించారు. సత్యనాదెళ్ల కష్టపడి బాగా చదువుకొని మైక్రోసాఫ్ట్ సీఈవో స్థానికి చేరుకుంటే.. అదీ నా ఘనతే అంటున్నాడని జగన్ ఎద్దేవా చేారు. పాపం సింధు కష్టపడి ఆడిఆడి క్రీడాకారిణిగా రాణిస్తే ఆమెకు షటిల్ ఆడడం తానే నేర్చించానంటున్నాడు. నిన్ననో, మొన్ననో ఎండలు 10 డిగ్రీలు తగ్గించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాడు. అంటే సూర్యుడికి ఫోన్ చేసి పది డిగ్రీలు తగ్గించాలని చెప్పాలేమో’ అంటూ చంద్రబాబు తీరుపై జగన్ సెటైర్లు వేశారు..
*అవినీతి తారాస్థాయికి..
రాష్ట్రంలో అంతులేని అవినీతి చోటుచేసుకుందని జగన్ విమర్శించారు. పైన చంద్రబాబు కింద స్థాయిలో జన్మభూమి కమిటీలు అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ‘పైన చంద్రబాబు మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములు చివరకు గుడిలోని ఆభరణాలను దోచికెళ్తున్నాడని.. కింద గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో ఓ మాఫియాను తయారీ చేసి రాష్ట్రంలో విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నాడని ’ తీవ్ర ఆరోపణలు చేశాడు..
*అక్వా పరిస్థితి దారుణం..
ఉంగటూరు నియోజకవర్గంలో అక్వా రైతుతు తీవ్రంగా నష్టపోతున్నారని.. ధరలు తగ్గి రైతులు నష్టపోతుంటే.. వ్యాపారులే దళారులై ధరలు తగ్గిస్తున్నారని రైతులు తనతో మొరపెట్టుకున్నట్టు జగన్ తెలిపారు.. చేపపిల్లలను ఉత్పత్తి చసే హేచరిస్ మొదలు దాణా వరకు.. చేప పిల్లలు మొదలు మార్కెటింగ్ వరకు అన్ని దళారి వ్యవస్థలే అన్నారు. ప్రైవేటు ల్యాబ్స్ తో వ్యాపారులు కుమ్మక్కై తమను మోసం చేస్తున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు.
*అన్నింటా తాను ముందుంటా..
కొల్లేరు సమస్య ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని.. దీన్ని చిత్తశుద్దితో పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సమస్యపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి నా పక్కనే కూర్చుండబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి ఏం చేయాలో అంతా చేస్తామని స్పష్టం చేశారు. 199లో చంద్రబాబు సర్వే చేయించకపోవడం వల్లే ఆ గ్రామాలు మునిగిపోతున్నాయని అన్నారు.