Begin typing your search above and press return to search.
ఏబీ వెంకటేశ్వర్లకు జగన్ సర్కార్ ఊహించని షాక్
By: Tupaki Desk | 19 Dec 2020 4:18 AM GMTచంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ముప్పు తిప్పలు పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనిపై వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే సీఎంగా జగన్ అయ్యాక ఏబీ వెంకటేశ్వరరావుకు షాకిచ్చారు. ఆయనపై కేసు కారణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకొని పక్కనపెట్టారు. పోస్టింగ్ ఇవ్వలేదు. అనంతరం కేసు కారణంగా సస్పెండ్ చేశారు.
తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరోసారి షాకిచ్చింది. ఏబీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 1969 ఆలిండియా సర్వీసెస్ రూల్ 8 ప్రకారం చర్యలు తీసుకుంది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రబాబు హయాంలో ఇజ్రాయెల్ సంస్థ ఆర్.టి. ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ నుంచి నిఘా సామగ్రిని కొనుగోలు చేసే విషయంలో అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు పాటించలేదని.. తన కొడుకు యాజమాన్యంలోని కంపెనీకి కాంట్రాక్టును ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం విచారణ జరిపి ఫిబ్రవరి 8న వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేసింది.
అయితే ఏబీ వెంకటేశ్వర రావు రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ను సవాలు చేస్తూ క్యాట్ తలుపులు తట్టాడు. కానీ క్యాట్ ఈయన పిటిషన్ ను కొట్టివేసింది. కేసులను నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తరువాత క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించినా వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ఈ తరుణంలో మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని ఏబీకి సీఎస్ నీలం సాహ్ని నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా లేదా వ్యక్తిగతంగా ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా సీఎస్ నీలం సాహ్ని ఏబీపై చర్యలు తీసుకున్నారు.