Begin typing your search above and press return to search.

బాబు రిక్వెస్ట్ త‌ర‌హాలోనే జ‌గ‌న్ పార్టీ కోరింది.. నెక్ట్స్ ఏంటి?

By:  Tupaki Desk   |   6 Jun 2019 5:55 AM GMT
బాబు రిక్వెస్ట్ త‌ర‌హాలోనే జ‌గ‌న్ పార్టీ కోరింది.. నెక్ట్స్ ఏంటి?
X
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మాజీ ముఖ్య‌మంత్రి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు రిక్వెస్ట్ చేయ‌టం తెలిసిందే. త‌మ అవ‌స‌రాలు తీర్చుకునేందుకు వీలుగా ప్ర‌జావేదిక‌ను త‌మ‌కు కేటాయించాలంటూ బాబు ఒక లేఖ‌ను రాశారు. బాబు కోరిన ప్ర‌జావేదిక విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఈ అంశంపై అనుకోని రీతిలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించుకునేందుకు వీలుగా ప్ర‌జా వేదిక‌ను త‌మ‌కు కేటాయించాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను కోరింది జ‌గ‌న్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శిల ర‌ఘురాం ఈ మేర‌కు ఒక లేఖ రాశారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ప్ర‌జావేదిక‌ను త‌మ‌కు కేటాయించాల‌ని జ‌గ‌న్ కు చంద్ర‌బాబు లేఖ రాస్తే.. ఇదే భ‌వ‌నం కోసం జ‌గ‌న్ పార్టీ ఏపీ సీఎస్ కు లెట‌ర్ రాశారు. దీంతో.. ఈ అంశంపై తుది నిర్ణ‌యం ఎల్వీ మీద‌నే ఉంది.

అధికార పార్టీ.. ప్ర‌భుత్వం మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ప్ర‌జావేదిక అనువుగా ఉంటుంద‌ని.. ఇక్క‌డ నిర్వ‌హించే స‌మావేశాల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడి హోదాలో జ‌గ‌న్ పాల్గొంటార‌ని త‌ల‌శిల పేర్కొన్నారు. సీఎం భ‌ద్ర‌త‌తో పాటు.. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఉండేలా ప్ర‌జావేదిక అనువుగా ఉంటుంద‌న్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌జావేదిక అక్ర‌మ క‌ట్ట‌డ‌మ‌ని తేలితే.. త‌క్ష‌ణం ఖాళీ చేసి ఇవ్వ‌టానికి తాము సిద్ధ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌జావేదిక విష‌యంలో అధికార‌.. విప‌క్ష పార్టీలు రెండు కోరుకోవ‌టంతో ఇప్పుడు దాన్ని ఎవ‌రికి కేటాయిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వేదిక‌ను త‌మ‌కివ్వాల‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు నేరుగా లేఖ రాస్తే.. జ‌గ‌న్ పార్టీ నేత మాత్రం ఏపీ రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను రిక్వెస్ట్ చేశారు. మ‌రి.. ఎవ‌రి రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుందో చూడాలి.