Begin typing your search above and press return to search.

రాజగురువుతో జగన్...యాగ ఫలం అదేనా...?

By:  Tupaki Desk   |   17 May 2023 6:48 PM GMT
రాజగురువుతో జగన్...యాగ ఫలం అదేనా...?
X
ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ. ఇక రాజకీయ నేతలకు అవి ఇంకా ఎక్కువ. జగన్ విషయం తీసుకుంటే ఆయన గతంలో పెద్దగా హోమాలు యాగాల పట్ల ఆసక్తి కనబరచలేదు. కానీ 2014 ఎన్నికల తరువాత మాత్రం ఆయన చాలానే మారిపోయారు.

ఆయన వెనక ఉన్నది విశాఖ శ్రీ శారదాపీఠానికి చెందిన స్వరూపానందేంద్ర మహాస్వామి అని అంటారు. ఇక రాజశ్యామల అమ్మ వారి యాగాన్ని ఆయన చేశారు. జగన్ కోసమే ఆ యాగం చేశారని దాని వల్లనే జగన్ అధికారాన్ని అందుకున్నారని కూడా ప్రచారం జరిగింది.

సరిగ్గా ఏడాదిలో ఎన్నికలు ఉంటాయనగా ఇపుడు మరోసారి రాజశ్యామల యాగం విజయవాడ నడిబొడ్డున జరిగింది దేవాదాయ శాఖ ఆద్వర్యంలో అష్టలక్ష్మీ అమ్మ వారి యాగం కూడా జరిగింది. ఈ యాగాలు పూజలు హోమాలు ఆరు రోజుల పాటు జరిగాయి. చివరి రోజున విశాఖ శారదాపీఠం నుంచి స్వరూపానందేంద్ర హాజరయ్యారు.

ఆయన జగన్ని దీవించారు జగన్ కి ఆయనే రాజ గురువు అని చెబుతారు. దాంతో రాజ గురువు సమక్షంలో యాగాలు చేసిన జగన్ కి మళ్లీ అధికారం దక్కుతుందని వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. యాగ ఫలాలు,ఫలితాలు జగన్ కి నిండుగా దక్కుతాయని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జగన్ సైతం తాను ప్రజలను దేవుడిని మాత్రమే నమ్ముకుంటున్నాను అని చెప్పారు. ప్రజలకు ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు దేవుడికి సంబంధించిన యాగాలు హోమాలు చేస్తున్నారు. ఇక రాజశ్యామల అమ్మ వారి యాగం అంటే కచ్చితంగా అధికారం కటాక్షిస్తుంది అని వైసీపె నేతలు భావిస్తున్నారు.

దాంతో పాటు సెంటిమెంట్ కూడా మళ్లీ కలసివస్తుందని నమ్ముతున్నారు. శారాదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ కూడా తోడు ఉండడం నిండుగా దీవించడంతో ఏపీలో వైసీపీ ఆలోచనలు ఆశలు ఫలిస్తాయని అంటున్నరు.

ఇక జగన్ కి స్వరూపానందేంద్ర అన్నీ దగ్గరుండి చేయించారు. జగన్ సైతం పూర్తి ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు యాగం జరిగిన తీరు పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆరు రోజుల పాటు జరిగిన ఈ యాగాలు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతాయని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలు అంతా నా మీద ఉంచిన అంచంచల విశ్వాసానికి తాను ధన్యుడిని అని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర మరింతగా అభివృద్ధి చెందేలా చూద్దామని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. మొత్తానికి యాగం బాగా సాగింది. జాగ ఫలం వైసీపీకి దక్కుతుందా అన్నదే ఇపుడు ఆసక్తి కరమైన అంశం. రాజ గురువు అయితే దీవించేశారు కాబట్టి వైసీపీ 2019 మ్యాజిక్ రిపీట్ అవుతుందని నమ్ముతోంది.