Begin typing your search above and press return to search.
గవర్నర్‌తో జగన్ భేటీ.. రహస్య మంతనాలు..?
By: Tupaki Desk | 13 Feb 2023 3:06 PM GMTఏపీ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయిన.. ప్రస్తుత ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్లపాటు సేవలందించి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా సుప్రీకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే.
ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి గవర్నర్‌గా బదిలీ చేశారు. ఈ నేపథ్యంంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడ లోని రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్ దంపతులు అక్కడ గవర్నర్ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ గా ఆయన అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నా రు. దేవుడి ప్రతిమల్ని జ్ఞాపకంగా అందచేశారు.
అయితే.. ఈ సందర్భంగా సుమారు 20 నిమిషాల పాటు.. ముఖ్యమంత్రి జగన్.. గవర్నర్ ఏకాంతంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముందుగా మీడియాను లోపలికి ఆహ్వానించిన గవర్నర్ కార్యాలయ వర్గాలు.. తర్వాత వారిని పంపించేశాయి.
ఈ క్రమంలోనే సీఎం జగన్ గవర్నర్‌తో ప్రత్యేకంగా వేరే గదిలోకి వెళ్లి.. చర్చించారు. వీరి మధ్య ఏం జరిగిందనేది తెలియకపోయినా.. రాజకీయ వర్గాలు మాత్రం.. ఏదో కీలక విషయంపైనే చర్చించినట్టు తెలుస్తోందని అంటున్నాయి.
మూడు రాజధానులను గవర్నర్ సమర్ధించారు. ఈ క్రమంలో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చించారా? లేక త్వరలోనే ఏపీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని.. జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించారా? అనే విషయాలపైనా రాజకీయ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.