Begin typing your search above and press return to search.

రోజాకు జగన్‌ చీవాట్లు తప్పవా...?

By:  Tupaki Desk   |   12 April 2015 10:34 AM GMT
రోజాకు జగన్‌ చీవాట్లు తప్పవా...?
X
వైసీపీ అధినేత జగన్‌ ఇటీవల కాలంలో తన దూకుడు తగ్గించారు.. ఆ పార్టీలో మంచి స్పీడున్న నేతలు కూడా ఆచితూచి అడుగులువేస్తున్నారు. అంతా వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకో నాలుగేళ్ల సమయం ఉండడం... ఈలోగా రాజకీయంగా తమకు అవకాశాలు ఉంటాయన్న ఛాన్సే లేకపోవడంతో అంతా వివాద రహితంగా సాగుతూ ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చుకోవద్దన్న ఉద్దేశంలో ఉన్నారు. అయితే... వైసీపీకే చెందిన ఎమ్మెల్యే రోజా రెడ్డి మాత్రం బస్తీ మే సవాల్‌ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఆ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు.

వైసీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ వ్యవస్థీకృతమైన పార్టీ మాత్రం కాదు. క్షేత్ర స్థాయిలో కట్టుబాట్లున్న పార్టీ కూడా కాదు. ఈ దశలో సంస్థాగతంగా పూర్తిగా బలపడకుండా రోజూ ఏదో ఒక వివాదంలో ఉంటుంటే ఆ ప్రభావం కింది స్థాయి కార్యకర్తలపై పడుతుంది. దీనివల్ల వారు ఏకంగా పార్టీకే దూరమయ్యే ప్రమాదమూ ఉంది. ఇవన్నీ ఆలోచించే జగన్‌ తాను స్వయంగా దూకుడు తగ్గించి పార్టీలోని మిగతా నాయకులనూ జాగ్రత్తగా చూసుకుని వెళ్లమని సూచనలు ఇచ్చారు. ఇది అర్తం చేసుకున్న నాయకులంతా అధినేత మనసెరిగి మేజర్‌ ఇష్యూస్‌ ఉంటే మాట్లాడుతున్నారు తప్ప చిల్లరచిల్లర విషయాలను పెద్దవి చేసుకోవడం లేదు. అయితే రోజారెడ్డి మాత్రం ఇదే మీ పట్టించుకోకుండా తానే డాన్‌ అన్నట్లుగా సాగిపోతున్నారు. మిగతా నాయకులంతా కామ్‌ గా ఉండడంతో ఆమె విపరీతంగా హైలైట్‌ అవుతున్నారు. దీంతో అదంతా తన ప్రతిభే అనుకుంటూ ఆమె మరింత రెచ్చిపోతున్నారు.

ఇలా... రోజా రెడ్డి వ్యవహారం పార్టీని ఇబ్బంది పెడుతుండడంతో జగన్‌ కాస్త సీరియస్‌ గా ఉన్నట్లు సమాచారం. అయితే.. తాను నేరుగా హెచ్చరించడం ఎందుకున్న ఉద్దేశంలో ఆయన ఉన్నారని... పార్టీ నేతలతో చెప్పించారని సమాచారం. రోజా అప్పటికీ వినకుండా ఇలాగే ప్రవర్తిస్తే జగన్‌ తో చీవాట్లు తినక తప్పకపోవచ్చు మరి.