Begin typing your search above and press return to search.

తప్పు చేసే వారి గుండెలు అదిరే చట్టాన్ని తెస్తున్న జగన్

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:18 AM GMT
తప్పు చేసే వారి గుండెలు అదిరే చట్టాన్ని తెస్తున్న జగన్
X
మహిళలపై వేధింపులు.. అత్యాచారాలు.. హత్యలు.. ఇలా ఎన్నో దుర్మార్గమైన నేరాలకు పాల్పడుతున్న వేళ.. ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా సంచలన చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ఏపీలోని జగన్ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వ్యవస్థలో మార్పునకు.. మహిళలపై.. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా తాము సరికొత్త చట్టాన్ని తీసుకు రానున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

తాము తీసుకొచ్చే చట్టానికి సంబంధించిన వివరాలు సంచలనంగా ఉండటం గమనార్హం. మహిళలపై అఘాయిత్యాలు చేసి.. రెడ్ హ్యాండెడ్ గా దొరకటమే కాదు.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే కేవలం 21 పని దినాల్లో ఉరిశిక్ష పడేలా బిల్లు తేనున్నట్లుగా చెప్పారు. మహిళలు.. చిన్నారులు ఇటీవల జరుగుతున్న ఘటనలు తనను తీవ్రంగా కలిచి వేస్తున్నాయని.. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో అవసరమైన మార్పులు చేయటానికి సలహాలు.. సూచనలు అడుగుతున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా జగన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చూస్తే..

% 26 ఏళ్ల మహిళా డాక్టర్‌ను టోల్‌ గేట్‌కు సమీపంలో రేప్‌ చేసి, కాల్చేసిన ఘటన మనకళ్ల ముందు కనిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పడు రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? అని ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపించింది.

% మన రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరిగితే మన పోలీసులు ఎలా స్పందించాలి? మనం ఎలా స్పందించాలన్న దానిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దిశ ఘటన టీవీల్లో చూసినప్పుడు, విన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన తర్వాత అందుకు బాధ్యులైన వారిని ఎన్‌కౌంటర్‌ చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం.

% ‘దిశ’ ఘటనలో తప్పు జరిగిందని మీడియా విస్తృతంగా చూపించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హేట్సాఫ్‌ టు కేసీఆర్, తెలంగాణ పోలీసు ఆఫీసర్స్‌.. అని ఈ చట్టసభ సాక్షిగా చెబుతున్నాం.

% సినిమాల్లో హీరో ఏదైనా ఎన్‌కౌంటర్‌ చేస్తే.. అందరం చప్పట్లు కొడతాం. సినిమా బాగుందని చెబుతాం. కానీ నిజ జీవితంలో దమ్మున్న వాళ్లు ఎవరైనా చేస్తే.. జాతీయ మానవ హక్కుల సంఘం పేరుతో ఢిల్లీ నుంచి వస్తారు. ఇది తప్పు.. ఇలా జరక్కూడదు.. ఇలా ఎందుకు చేశారు? అని నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి.