Begin typing your search above and press return to search.

క‌రోనా బాధితుల‌కు అదే ‘గోల్డెన్ టైమ్‌’.. రూ.2 వేల‌తో ఖ‌తం!

By:  Tupaki Desk   |   6 May 2021 1:30 PM GMT
క‌రోనా బాధితుల‌కు అదే ‘గోల్డెన్ టైమ్‌’.. రూ.2 వేల‌తో ఖ‌తం!
X
‘‘క‌రోనా రావ‌డం పెద్ద స‌మ‌స్య‌కాదు.. వ‌చ్చిన త‌ర్వాత దాన్ని హ్యాండిల్ చేసే విధాన లోపం వ‌ల్ల‌నే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు’’ ఇదీ.. వైద్యులు చెబుతున్న మాట‌. ప్ర‌ధానంగా వైర‌స్ సోకిన వారు తాము ప్రాణాపాయంలో ఉన్నామ‌ని బెంబేలెత్తి పోవ‌డం వ‌ల్ల‌నే ప‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతోంద‌ని చెబుతున్నారు. దీంతోపాటు మ‌రో ముఖ్య‌మైన విష‌యాన్ని కూడా సూచిస్తున్నారు. అదే ‘గోల్డెన్ టైమ్’.

కొవిడ్ సోకిన తర్వాత తొలి ఐదు రోజులను గోల్డెన్ టైమ్ గా భావించాల‌ని సూచిస్తున్నారు. అంటే.. ఆ స‌మ‌యంలో వైర‌స్ విస్త‌ర‌ణ త‌క్కువ‌గా ఉంటుంద‌ని సూచిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ఐదు రోజులు వైద్యుడి ప‌రిశీల‌న‌లో ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి అని సూచిస్తున్నారు.

జ్వ‌రం, త‌ల‌నొప్పి, ద‌గ్గు, జ‌లుబు, ఒళ్లు నొప్పులు.. వీటిలో ఏ ఒక్క‌టి ఉన్నా నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని చెబుతున్నారు. నిజానికి డెంగ్యూ, మ‌లేరియాయ వంటి వ్యాధుల ల‌క్ష‌ణాలు కూడా ఇదేవిధంగా ఉంటాయ‌ని చెబుతున్న డాక్ట‌ర్లు.. క‌రోనా టైం కాబ‌ట్టి ముందు నుంచే జాగ్ర‌త్త తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

ఇందులో భాగంగా.. ల‌క్ష‌ణాలు క‌నిపించిన మొద‌టి రోజునే క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల‌ని సూచిస్తున్నారు. అయితే.. అందులో నెగెటివ్ వ‌స్తే లైట్ తీసుకోవ‌ద్ద‌ని చెబుతున్నారు. ఖ‌చ్చితంగా వైద్యుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రీట్మెంట్ పొందాల‌ని అంటున్నారు. ప్రాథ‌మిక ద‌శ‌లోనే క‌ఠిన వైద్యం తీసుకోవ‌డం ద్వారా.. వైర‌స్ ను పార‌దోల‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఆన్ లైన్ ద్వారానైనా వైద్యుల‌కు ల‌క్ష‌ణాలు చెప్పి, వారు సూచించే మందులు వేసుకోవాల‌ని చెబుతున్నారు. ఇప్పుడు ఆసుప‌త్రుల్లో చేరుతున్న‌వారిలో చాలా మంది ముందుగా నెగెటివ్ వ‌చ్చింద‌ని లైట్ తీసుకున్న‌వాళ్లేన‌ట‌. అందువ‌ల్ల ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యుల సూచ‌న‌ల‌తో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల‌ని చెబుతున్నారు. మూడు రోజుల్లో జ్వ‌రం, ఇత‌ర ల‌క్ష‌ణాలు త‌గ్గ‌క‌పోతే వెంట‌నే ఆసుప‌త్రిలో చేరాల‌ని సూచిస్తున్నారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల కేవ‌లం 2 వేల ఖ‌ర్చుతోనే క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డొచ్చ‌ని చెబుతున్నారు. ఆల‌స్యం చేస్తే `10 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసినా.. ప్రాణం నిల‌బ‌డుతుంద‌నే గ్యారెంటీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. అందువ‌ల్ల ‘గోల్డెన్ టైమ్’ను జాగ్రత్తగా కాపాడుకొని, కొవిడ్ నుంచి బయటపడాలని కోరుతున్నారు.