Begin typing your search above and press return to search.

శ్రీశైలం దేవాస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

By:  Tupaki Desk   |   2 Jun 2020 12:30 PM GMT
శ్రీశైలం దేవాస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు
X
తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం క్రియేట్ చేసిన‌ శ్రీశైలం ఆల‌యంలో అభిషేకం, ఆర్జిత సేవల టికెట్లలో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఆల‌యంలో మొత్తం రూ.2.12 కోట్ల అవినీతి జరిగిందని..కాజేసిన‌ సొమ్ములో 83.40 లక్షల రూపాయలు, కారును స్వాధీనం చేసుకున్నామ‌ని డీఎస్పీ జె.వెంకట్రావు వివ‌రించారు.

డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్టు గుర్తించారు. షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. నిందితులు 4 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి..వాటి ద్వారా అభిషేకం టిక్కెట్ల అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుల్లో మళ్లీ కొందరిని కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జ‌రుపుతామ‌ని చెప్పారు. కాగా ఈ స్కామ్ లో దర్శిల్లీ, రూపేష్ లుగా సూత్రధారులు గుర్తించినట్లు వెల్ల‌డించారు. ఉద్యోగులు ఒక‌రిపై, ఒక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.