Begin typing your search above and press return to search.

సెక్స్ బొమ్మ‌కు విడాకులు ఇచ్చేశాడు.. మ‌రో బొమ్మ‌ను పెళ్లి చేసుకున్నాడు..!

By:  Tupaki Desk   |   16 March 2021 11:30 PM GMT
సెక్స్ బొమ్మ‌కు విడాకులు ఇచ్చేశాడు.. మ‌రో బొమ్మ‌ను పెళ్లి చేసుకున్నాడు..!
X
స్త్రీ పురుష వ్యామోహం ప్ర‌కృతి ధ‌ర్మం. ప్ర‌కృతి విరుద్దంగా సాగే స్వలింగ సంపర్కాన్ని కూడా కొంద‌రు ఆమోదిస్తున్నారు. కానీ.. ఇక్క‌డ చెప్పుకోబోయేది అత్యంత‌ అరుదైన జాతి గురించింది. ఇత‌గాడి పేరు టోలోచ్కో. కజక్ లో నివసిస్తుంటాడు. ఏజ్ కూడా పెద్దదేం కాదు.. జ‌స్ట్ 36. ఈయ‌న శృంగారం, వైవాహిక జీవితం గురించి తెలిస్తే మాత్రం అంద‌రూ నోరెళ్ల బెట్టాల్సిందే.

ఇత‌నికి ఆడ‌వాళ్ల మీద ఎలాంటి కోరికా లేదు. అలాగ‌ని ఇత‌గాడిలో 'విష‌యం' లేద‌నుకుంటారేమో.. అదేం కాదు. బండి ఫుల్‌ కండీష‌న్లోనే ఉంది. కాక‌పోతే.. మనుషులను చూస్తే మూడ్ రాదు. ఆడ బొమ్మలు కనిపిస్తే చాలు మీటర్ వంద దాటిపోతుంది!

ఆ విధంగా.. ఆడ బొమ్మ‌ల‌కే అంకితం అయిపోయాడు. వాటితోనే శృంగారానికి అల‌వాటు ప‌డ్డాడు. చివ‌ర‌కు ఫుల్లుగా న‌చ్చిన ఓ బొమ్మ‌ను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ బాగోతం అంతా.. గ‌తేడాది న‌వంబ‌ర్ లో జ‌రిగింది. పెళ్లంటే ఆషామాషీగా కాదు.. చుట్టాల‌ను రప్పించి, బ్యాండ్ మేళం విత్ డీజే పెట్టించి, బ‌రాత్ ఇర‌గ‌దీసి మ‌రీ మ్యారేజ్ చేసుకున్నాడు. వ‌చ్చినోళ్లు 'ఇదేం తింగ‌రి య‌వ్వారంరా బై..' అంటే 'చిల్ మామ.. ఇట్స్ మై లైఫ్.. ఇట్స్ మై డ్రీమ్' అంటూ ఎంజాయ్ చేశాడు.

అయితే.. ఇప్పుడు ఆ బొమ్మకు విడాకులు ఇచ్చేశాడట టోలోచ్కో. ఓ చిన్న రోబోలా ఉండే ఈ సెక్స్ డాళ్ ఈ మధ్య కిందపడి డామేజ్ అయ్యిందట. దీంతో.. రిపేర్ చేయిద్దామని తీసుకెళ్లిన ఇతగాడి కంట మరో బొమ్మ పడిందట. మనసు లేని ఈ టోలోచ్కో మామూలు మనిషిలాగే బిహేవ్ చేశాడు. ఈ బొమ్మను అక్కడ పడేసి, ఆ బొమ్మను తీసుకొచ్చి, పెళ్లి కూడా చేసుకున్నాడట.

తన కొత్త వైఫ్ పేరు లోలా క్వీర్ అని ప్రకటించాడు టోలోచ్కో. ఈ వివ‌రాల‌న్నీ సోష‌ల్ మీడియాలో అనౌన్స్ చేస్తుంటాడు ఈ అరుదైన జాతి అధ్య‌క్షుడు. ఎవ్వ‌రు తిట్టుకున్నా.. ఏం అనుకున్నా.. ఐ డోన్ట్ కేర్ అంటూ అలా ముందుకు సాగుతున్నాడు. మ‌రి, ఈ బొమ్మ‌తో ఎన్నాళ్లు సంసారం చేస్తాడో చూడాలి అంటున్నారు నెటిజ‌న్స్‌.