Begin typing your search above and press return to search.
బిడ్డింగ్ కి బీయారెస్ కి దూరం...అందుకేనా...?
By: Tupaki Desk | 16 April 2023 1:33 PM GMTబీయారెస్ కి ఏపీతో పని ఏంటి అంటే అది జాతీయ పార్టీ అయింది కాబట్టి ఏపీలో కూడా తిరగవచ్చు, పోటీ చేయవచ్చు మాట్లాడవచ్చు. అందులో భాగంగానే సరైన ఇష్యూని టేకప్ చేస్తే జనంలోకి దూసుకుపోవచ్చు అని పక్కాగా ప్లాన్ చేసుకుని మరీ ఇప్పటికి రెండేళ్ళుగా నలుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద బీయరెస్ బిగ్ సౌండ్ చేసింది.
తెలుగు వారి హక్కుగా ఉన్న ప్లాంట్ ని ఎలా అమ్మేస్తారు అని బీయారెస్ లాజిక్ పాయింట్ తీసింది. చేతనైతే కేంద్రం అయిదు వేల కోట్లను అర్జంటుగా ఇచ్చి ప్లాంట్ ని కాపాడాలని సూచించింది. ప్లాంట్ ని తెగనమ్మాలని చూస్తే మహా ఉద్యమమే అని కన్నెర్ర చేసింది. ఇంతలో స్టీల్ ప్లాంట్ లో కొన్ని విభాగాలకు మూల ధనం కోసం అవసరం అయిన వాటికి బిడ్లను ఆహ్వానించారు.
ఆ బిడ్లలో పార్టిసిపేషన్ చేయడం ద్వారా మోడీకి ఎదురు నిలవాలని స్టీల్ ప్లాంట్ ని టేకోవర్ చేయాలని కూడా బీయారెస్ ఆలోచించింది. అలా మీడియాలో విపరీతమైన వార్తలు కవరేజి వచ్చాయి. ఇన్ని జరిగాక సింగరేణి నుంచి డైరెక్టర్ల టీం కూడా స్టీల్ ప్లాంట్ కి వచ్చి మార్కెటింగ్ అధికారులతో మంతనాలు జరిపింది. ఇంకేముంది స్టీల్ ప్లాంట్ ని మోడీ అమ్మేస్తే కేసీయార్ కొనేస్తారు అలా ఏపీకి వరమైన అతి పెద్ద ప్లాంట్ ని కాపాడేస్తారు అని విపరీతంగా ప్రచారమూ జరిగింది.
కానీ భారీ ట్విస్ట్ ఏంటి అంటే బిడ్డింగ్ జరిగింది మొదట అనుకున్న గడువు ముగిసింది. కానీ బీయారెస్ నుంచి ఎవరూ బిడ్ ని దాఖలు చేయకపోవడమే తమాషా. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇరవై రెండు కంపెనీలు బిడ్ ని దాఖలు చేసాయని చెబుతున్నారు. మరి ఇంతలా హడావుడి చేసిన బీయారెస్ బిడ్ ని ఎందుకు దాఖలు చేయలేదు, ఎందుకు సైలెంట్ గా ఉంది అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న.
ఇదిలా ఉంటే సింగరేణి డైరెక్టర్ల బృందం స్టీల్ ప్లాంట్ వచ్చి అక్కడ బిడ్ గురించి ప్లాంట్ గురించి తాము సేకరించిన పూర్తి నివేదికను ముఖ్యమంత్రి కేసీయార్ ముందు పెట్టారని అంటున్నారు. ఆ మీదట సీఎం పేషీ నుంచి ఏ విధమైన డైరెక్షన్ రాకపోవడం వల్లనే వారు మిన్నకున్నారని అంటున్నారు.
నిజానికి అయితే విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ద్వారా లేదా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ముడిసరుకు సరఫరా చేసేందుకు బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్లుగా మీడియాలో ప్రచారం విపరీతంగా చేసుకున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు అన్నది ప్రశ్న. దానికి జవాబు అయితే బీయారెస్ వారే చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.
అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బిడ్ గడువుని ఈ నెల 20వ తేదీ దాకా పొడిగించింది కాబట్టి కచ్చితంగా ఒకటి రెండు రోజులలో స్టీల్ ప్లాంట్ కి బీయారెస్ ప్రభుత్వం తరఫున అక్కడి కంపెనీ ప్రతినిధులు ఎవరైనా వచ్చి బిడ్ ని దాఖలు చేయవచ్చు అని ఊహిస్తున్నారు. అది కనుక జరగకపోతే మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీయారెస్ పూర్తిగా పబ్లిసిటీ స్టంట్ కే పరిమితం అయిందని విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.