Begin typing your search above and press return to search.

పని చేయ‌ని అధికారుల‌పై న‌ల్లులు వ‌దిలాడు

By:  Tupaki Desk   |   7 Jun 2017 5:28 PM GMT
పని చేయ‌ని అధికారుల‌పై న‌ల్లులు వ‌దిలాడు
X
ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నులు కాక‌పోతే సామాన్యులు ఎంత‌గా విసిగిపోతారో మ‌న‌లో చాలా మందికి అనుభ‌వమే. అయితే అలా బాధ‌ప‌డిన ఓ వ్య‌క్తి చిత్ర‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. త‌న ఇంట్లో ఉన్న న‌ల్లుల గురించి ఫిర్యాదు చేయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి స‌మ‌స్య‌ను అధికారులు ప‌ట్టించుకోలేద‌ని... ప్ర‌భుత్వ ఆఫీస్ లోకి న‌ల్లుల‌ను వ‌దిలేశాడు. అంతే.. ఇక త‌ల‌లు ప‌ట్టుకున్న ప్రభుత్వ అధికారులు వాటిని చంపి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి నానాక‌ష్టాలు ప‌డ్డారు. ఈ విచిత్ర సంఘ‌ట‌న యూఎస్ లోని మైనే రాష్ట్రంలోని ఆగ‌స్టాలో చోటు చేసుకుంది.

ఆగ‌స్టా కు చెందిన ఓ వ్య‌క్తి త‌న ఇంట్లో న‌ల్లులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని..వెంట‌నే త‌న‌కు వేరే అపార్ట్ మెంట్ ప‌ర్మిష‌న్ కావాల‌ని కోడ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీస్ కు వెళ్లాడు. అయితే.. ఆయ‌న ఫిర్యాదును అక్క‌డి అధికారులు ప‌ట్టించుకోలేదు. దీంతో కోపంతో ఆయ‌న వెంట తీసుకొచ్చిన న‌ల్లులు ఉన్న క‌ప్పును ఆఫీసులోప‌లికి విసిరేసి వెళ్లిపోయాడు. న‌ల్లుల‌ను గ‌మ‌నించిన అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై వాటిని చంప‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. కొన్ని న‌ల్లులైతే ఇత‌ర అధికారుల మీదికి ఎక్కుతుండ‌టంతో ఆఫీస్ ను క్లోజ్ చేసి వాటిని చంపే పనిలో అధికారులు ప‌డ్డారు. వెంట‌నే పెస్ట్ కిల్ల‌ర్స్ ను పిలిపించి మ‌రీ ఆపీస్ మొత్తాన్ని న‌ల్లులు లేకుండా చేశారు. అయితే.. ఇంట్లో న‌ల్లులు ఉంటే జ‌న‌ర‌ల్ అసిస్టెన్స్ ఆఫీస్ చేయాల్సిందేమీ ఉండ‌ద‌ని.. ఇది కావాల‌నే చేసిన ప‌ని అయి ఉంటుంద‌ని ఆఫీస్ మేనేజ‌ర్ అనుమానం వ్య‌క్తం చేశాడు. ఇక‌,న‌ల్లులను ఆఫీస్ లోకి వ‌దిలిన వ్య‌క్తి కోసం పోలీసులు గాలిస్తున్నార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/