Begin typing your search above and press return to search.
'ఆ' పని ఎక్కువ చేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే!
By: Tupaki Desk | 14 Jun 2023 7:00 AM GMTకరోనా మహమ్మారి తర్వాత ప్రజల జీవన విధానంలో చాలా మార్పులొచ్చాయి. అంతకుముందులా జనరల్ లైఫ్ అనుభవిస్తున్నా.. ఇంకా కొంత ఇబ్బందికర మైన పరిస్థితులనే ఉన్నాయి. అందులో సెక్చువల్ లైఫ్ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడిన చాలామంది ఒకరి కంటే ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొంటున్నట్టు ఈ మధ్య జరిపిన ఓ పరిశోధనలో వెల్లడయ్యింది.
అయితే.. ఇది ఆయా వ్యక్తుల సుఖమయ జీవనానికి సంతోషంగా ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సెక్చువల్ డిసీజెస్ తో చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో చాలా మంది ఎదుర్కొంటున్న వ్యాధి గనేరియా. ఈ లైంగిక వ్యాధి ప్రమాదం ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనే వారికే ఉంది.. ముఖ్యంగా 25 ఏండ్ల కంటే తక్కువ వయసున్న యువకులకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 82.4 మిలియన్ల మంది కొత్తగా గనేరియా బారిన పడ్డారని వెల్లడించింది. ఎస్టీఐ లపై గ్లోబల్ హెల్త్ సెక్టార్ స్ట్రాటజీ 2016-2021 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గనేరియాను 2030 కల్లా 90% తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
అసలు ఈ వ్యాధి గురించి అసలు వైద్యులు ఏం చెబుతున్నారంటే.. గనేరియా వ్యాధికారక నైస్సేరియా గనోరియా వల్ల వస్తుంది. ఇది బ్యాక్టీరియా వల్ల కలిగే రెండవ అత్యంత సర్వ సాధారణమైన లైంగిక సంక్రమణ. ఇది జన నేంద్రియాలను, పురీషనాళం, గొంతు వ్యాధులకు కారణం అవుతుందట.ఇక ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే... మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుందట. విపరీతమైన యోని ఉత్సర్గ,ఆడవారిలో పీరియడ్స్ మధ్య అసాధారణ ఉత్సర్గ ఉంటాయని అంటున్నారు.
దానితో పాటు రక్తస్రావం, పురుషాంగం నుంచి పసుపు లేదా ఆకుపచ్చ ఉత్సర్గ, పురుషాంగం వాపు, వృషణాల నొప్పి,ప్రేగు కదలికల్లో ఇబ్బంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి జననేంద్రియ ప్రాంతాలతో పాటుగా పురీషనాళం, కళ్లు, గొంతు, కీళ్లకు కూడా గనేరియా వస్తుంది. అయితే ముఖ్యంగా ఇది ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనే వారికే వస్తుందట. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని అంటున్నారు.