Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ వస్తే.. ఏకు మేకులా మారుతాడా?
By: Tupaki Desk | 28 Feb 2018 2:01 PM GMTతెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం తెలంగాణ పార్టీ కార్యకర్తలతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. నిన్న మిస్సయిన కార్యకర్తలకు తన 40 ఏళ్ల చరిత్ర మొత్తం తెలిసేలా మళ్లీ ఒకసారి రికార్డు వినిపించారు. ఆ అంశాలన్నీ పక్కన పెడితే.. తెలంగాణ పార్టీని ఏ రకంగా ఉద్ధరించాలనే విషయం మీద చాలా చర్చోపచర్చలు జరిగాయి.
ఒకవైపు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తెదేపాను - తెరాసలో విలీనం చేసేయాలంటూ శకునాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన బాహాటంగానే మీడియాతో అంటూ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తున్నారు. సమావేశంలో ప్రధానంగా మోత్కుపల్లిపై చర్య తీసుకోవడం గురించి.. తెలంగాణ పార్టీని కాపాడుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ అధ్యక్షుడిని చేసి.. సారథ్యం అప్పగించడం గురించి చర్చ జరిగినట్లుగా తెలిసింది.
అయితే.. ఈరెండు విషయాలను కూడా కార్యకర్తలు ఎంత బలంగా వినిపించినప్పటికీ.. రెండు అంశాల్లోనూ వారి మాటను చెవిన వేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మోత్కుపల్లిని సస్పెండ్ చేయడం అంత ఈజీ విషయం కాదనేది విశ్లేషకుల మాట. ఎస్సీ వర్గానికి చెందిన మోత్కుపల్లిని దూరం చేసుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పైగా ఆయనకు గవర్నర్ అని.. రకరకాలుగా పార్టీ ఆశ పెట్టి.. మోసం చేసిందనే ప్రచారం ఇప్పటికే ముమ్మరంగా ఉంది. ఇలాంటి నేపథ్యంల సస్పెన్షన్ అనేది అనూహ్యం.
పైగా ఎన్నికల నాటికి అవసరమైతే తెరాస తో పొత్తు పెట్టుకుని అయినా.. కాసిని సీట్లు సంపాదించుకోవాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు ఉండవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే గనుక.. ఆ సమయంలో తెరాసతో లాబీయింగ్ చేయడానికి ఉపయోగపడే అస్త్రం కూడా మోత్కుపల్లి అవుతారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తేవడం కూడా బాబుకు ఇష్టం లేదని సమాచారం. ఆయన వచ్చి తెలంగాణ పార్టీని స్థిరంగా గాడిలో పెట్టగలిగినా సరే.. అది తన కొడుకు లోకేష్ ఫెయిల్యూర్ కిందికే వస్తుందని ... తెలంగాణలో పార్టీని నిలబెట్టిన తర్వాత ఎన్టీఆర్ ఏపీ వైపు చూశాడంటే గనుక.. మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు భయపడుతుండవచ్చునని పలువురు అంటున్నారు. అందుకే ఎన్టీఆర్ ను కూడా ఏ రకంగానూ క్రియాశీల రాజకీయాల్లోకి రానివ్వరనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.