Begin typing your search above and press return to search.
కొండను తవ్విన ఒకే ఒక్కడు!
By: Tupaki Desk | 21 Aug 2017 5:32 PM GMTఅంగవైకల్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిపై సానుభూతి చూపించాల్సిన అధికారులు అవహేళన చేశారు. సాయం అర్థించడానికి వచ్చిన అతడిని అపహాస్యమాడారు. అతడిపై నిర్దయతో పరుష వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తి వారి మాటలకు కుంగిపోలేదు. పైగా, తనను అవమానించిన వారికి సమాధానమివ్వాలని ప్రతిన బూనాడు. మొక్కవోని సంకల్పంతో తాను అనుకున్నది సాధించేందుకు సాయశక్తులా కష్టపడ్డాడు. వికలాంగుడే అయినా, తన సమస్యకు తనే పరిష్కారాన్ని కనుగొన్నాడు. నవ్విన నాపచేను పండుతుందని నిరూపించాడు. అతడి కార్యదీక్షకు నెటిజన్లు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ఊరికి రహదారి లేకపోవడంతోనే తన భార్య చనిపోయిందని కొండను తవ్వి రోడ్డు వేసిన మాంఝీ కథ మనందరికి తెలుసు. నవాజుద్దీన్ సిద్దికీ హీరోగా ఆ యదార్థ గాధపై మాంఝీ అనే సినిమాను బాలీవుడ్‌లో నిర్మించిన సంగతి తెలిసిందే. కేరళలో మరో మాంఝీ తరహా ఘటన జరిగింది. తన ఇంటికి వెళ్లేందుకు రహదారి కోసం కొండను తవ్వి ఔరా అనిపించుకున్నాడు ఓ వికలాంగుడు.
కేరళకు చెందిన మెలితువీట్టిల్ శశి అనే వ్యక్తి కొబ్బరి తోటల్లో పనిచేసేవాడు. పద్దెనిమిదేళ్ల క్రితం కొబ్బరి చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో కుడివైపు పాక్షిక పక్షవాతం వచ్చింది. కుడిచేయి.. కుడికాలు సరిగ్గా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవడంతో చిన్నగా నడుస్తూ తన సొంత పనులు చేసుకుంటున్నాడు. కుటుంబపోషణ కోసం సమీపంలోని తిరువనంతపురం వెళ్లి లాటరీ టికెట్లు అమ్మాలనుకున్నాడు. ప్రతిరోజు తిరువనంతపురం వెళ్లి రావడానికి మూడు చక్రాల వాహనం కోసం వికలాంగుల కోటాలో తమ గ్రామ పంచాయతీ అధికారులకు అర్జీ చేసుకున్నాడు. ఆ అధికారులు అతనికి సహకరించకపోగా చులకనగా మాట్లాడారు. శశి ఇంటికి వెళ్లే దారిలో కొండ అడ్డం ఉండడంతో అధికారులు వాహనానన్ని మంజూరు చేయలేదు. పైగా, మూడు చక్రాల వాహనం మంజూరు చేస్తే నీ ఇంటికి గాల్లో ఎగురుకుంటూ వెళ్తావా? అంటూ ఎద్దేవా చేశారు. వారి మాటలకు కుంగిపోని శశి తన ఇంటి ముందున్న కొండను తొలగించి రహదారి వేయించాలని తిరిగి అధికారులను కోరాడు. కానీ వాళ్లు పట్టించుకోలేదు.
కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక విసిగిపోయాడు. దీంతో స్వశక్తిని నమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సాయం లేకుండా తానే సొంతంగా కొండను తవ్వి రహదారిని నిర్మించుకోవాలని సంకల్పించాడు. పలుగు, పార చేతపట్టి రోజుకు 6 గంటలపాటు కొండను తవ్వడం ప్రారంభించాడు శశి. ఈ క్రమంలో ఎన్నోసార్లు గాయపడ్డా, నిరుత్సాహ పడకుండా తన పనిని పూర్తి చేశాడు. మూడేళ్లపాటు శ్రమించి తన ఇంటికి రహదారిని నిర్మించుకున్నాఅధికారులు శశికి సహకరించలేదు. శశి గురించిన కథనం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు శశిని అభినందనలతో ముంచెత్తారు. అంతేకాకుండా, వాళ్లే చందాలు వేసుకొని మరీ అతనికి మూడు చక్రాల వాహనాన్ని కొని బహుమతిగా అందించారు.