Begin typing your search above and press return to search.
కేసీఆర్ లో కనిపించని కోణం.. జగన్ చూపించారుగా?
By: Tupaki Desk | 7 Nov 2019 6:51 PM GMTరాజకీయంగా సవాలక్ష ఉండొచ్చు.. కానీ కొన్ని విషయాల్లో కేసీఆర్ అనుసరించే వైఖరిని అస్సలు అంగీకరించనోళ్లు కోట్లల్లో ఉంటారు. ఇంటికి వచ్చినోళ్లకు మర్చిపోలేని విందు చేసి పంపే ఆయన.. రాజకీయ పార్టీలకు చెందిన ఇతర నేతల విషయంలో ఆయన తీరు సరిగా ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఆయన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం మధు నివాసానికి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవటంతో పాటు.. త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సాదారణంగా అధికారపక్షానికి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు చేయటంలో ముందుండే వామపక్షాలకు చెందిన ముఖ్యనేత అనారోగ్యానికి గురైతే.. స్వయంగా వెళ్లి పరామర్శించటం సమకాలీన రాజకీయాల్లో చాలా అరుదైన అంశంగా చెప్పక తప్పదు.
ఇలాంటి గుణం కేసీఆర్ లో కనిపించదని చెబుతున్నారు. వామపక్షనేతలు ఆయన్ను కలిసేందుకు వెళితే.. గంటల కొద్దీ సమయం వెయిట్ చేయించి.. కలవటం కుదరదని చెప్పి తిప్పి పంపించిన గతాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. జగన్ మాదిరి.. విపక్ష నేతల విషయంలో వ్యవహరిస్తే కేసీఆర్ ఇమేజ్ మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం కావటం గమనార్హం.