Begin typing your search above and press return to search.
అంకుల్ కు చివరగా ఫోన్ చేసింది అతడేనా?
By: Tupaki Desk | 5 Jan 2021 11:30 AM GMTతీవ్ర సంచలనంగా మారిన టీడీపీ సీనియర్ నేత అంకుల్ హత్య కేసును కొలిక్కి తెచ్చేందుకు.. నిందితుల్నిఅదుపులోకి తీసుకునే దిశగా పోలీసులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అంకుల్ హత్య నేపథ్యంలో ఆయన ఫోన్ తీసుకొని పోలీసులు విశ్లేషిస్తున్నారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అయిన పురంశెట్టి అంకుల్ ను.. ఆయన నిర్మిస్తున్న అపార్ట్ మెంట్ దగ్గరకు పిలిచి మరీ హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.
హత్య జరగటానికి ముందు ఆయన తన గ్రామంలోనే ఉండగా.. తనకొచ్చిన ఫోన్ కాల్ తోనే నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ వద్దకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ హత్యకు పాల్పడిన వారికి.. ఫోన్ చేసిన వారికి లింకు ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. హత్యకు గురైన అంకుల్ ఫోన్ కు గడిచిన రెండు.. మూడురోజులుగా ఎవరి నుంచి ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయి? అన్న అంశంపై పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు.
ఒక్కరే హత్య చేయటం సాధ్యం కాదని.. ఈ ఘటనలో నలుగురైదుగురు కలిసి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన అంకుల్ ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఆయనపై ద్వేషం ఎవరికి ఉంది. కిరాయి హత్యకు అసలు కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. ప్రస్తుతానికి మూడు టీంలతో హత్య కేసును విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా తన తండ్రి హత్యకు కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కర్పూరపు కోటయ్యతోపాటు గ్రామానికి చెందిన మరో పద్నాలుగు మంది కారణమని బాధితుడి కుమారుడు పరంజ్యోతి ఆరోపిస్తున్నారు. తామునిర్మిస్తున్న అపార్ట్ మెంట్ లోకి ఆదివారం సాయత్రం ఐదు గంటల సమయంలో వచ్చారని.. కోటయ్య తానో ప్లాట్ తీసుకుంటానని చెప్పి వచ్చి.. తన తండ్రిని తిట్టాడన్నారు. పార్టీని బలంగా తయారు చేశావు.. మాకు కంటగింపుగా మారావు. నిన్ను వదిలిపెట్టమని చెప్పి చంపారన్నారు. తాను అడ్డగిస్తున్నా.. వచ్చినోళ్లు తన తండ్రి చేతులు పట్టుకోగా.. మరికొందరుతన తండ్రి గొంతును వాల్చగా.. కత్తులతో గొంతుకోసి చంపారన్నారు. తన తండ్రి హత్య కేసులో ఎస్ఐ బాలనాగిరెడ్డి తో పాటు కాసు మహేశ్ రెడ్డిల హస్తం ఉందని ఆరోపించారు.