Begin typing your search above and press return to search.
జాతీయ మీడియా చేయలేంది అంతర్జాతీయ మీడియా చేసిందా ?
By: Tupaki Desk | 26 April 2021 7:30 AM GMTకరోనా సెకెండ్ వేవ్ ను అరికట్టడంలో నరేంద్రమోడి సర్కార్ నూరుశాతం విఫలమైందన్నది వాస్తవం. నిజానికి మొదటిదశలోనే లాక్ డౌన్ తర్వాత పరిస్ధితులను అదుపుచేయటంలో విఫలమైన మోడి ఆ పనిని రాష్ట్రాలకే అప్పగించేశారు. లాక్ డౌన్ తర్వాత అదుపుచేయాల్సిన పరిస్ధితులను రాష్ట్రాలపై నెట్టేసి మోడి చేతులు దులిపేసుకున్నారు. ఏదో మొత్తానికి తమకు తోచిన విధంగా రాష్ట్రాలు నెట్టుకొచ్చేశాయి.
అయితే జనాలు ఊహించనిరీతిలో సెకెండ్ వేవ్ యావత్ దేశాన్ని వణికించేస్తోంది. రోజుకు 3.4 లక్షల కేసులకు పైగా నమోదవుతున్నాయంటేనే పరిస్ధితులు ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది. పరిస్దితులు ఇంత భయంకరంగా ఉంటే వాస్తవాలను తెలియజేయాల్సిన జాతీయ మీడియా తన బాధ్యతనుండి తప్పుకున్నదనే చెప్పాలి. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి జాతీయ మీడియా వాస్తవాలను జనాలకు అందించటంలో వెనకబడింది.
కారణాలు ఏవైనా కానీండి మోడి అధికారంలోకి రాకముందు యూపీఏ ప్రభుత్వంపై జాతీయ మీడియా ఏ స్ధాయిలో రెచ్చిపోయేదో అందరికీ తెలిసిందే. అలాంటిది మోడి ప్రధాని అయిన తర్వాత మాత్రం జాతీయ మీడియా చప్పబడిపోయింది. ఇలాంటి నేపధ్యంలోనే కరోనా వైరస్+సెకెండ్ వేవ్ లో కేంద్రప్రభుత్వ వైఫల్యాలను మెజారిటి జాతీయ మీడియా పెద్దగా చూపటంలేదు.
సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయమీడియా మోడిపై రెచ్చిపోయింది. మోడి ప్రభుత్వం వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టేసింది. అదికూడా మామూలుగా కాదు. ఒక్కసారిగా మోడి ఇమేజంతా అంతర్జాతీయస్ధాయిలో ఫుల్లుగా డ్యామేజయిపోయింది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్, చైనా గ్లోబల్ టైమ్స్, బ్రిటన్లోని టైమ్స్ పత్రికలు దేశంలోని పరిస్ధితులను ఎండగట్టేశాయి. మొత్తానికి జాతీయ మీడియా చేయలేని పనిని అంతర్జాతీయ మీడియా చేసింది.