Begin typing your search above and press return to search.
సీతక్క తల్లి విషయంలో మహిళా డీసీపీ అలా ప్రవర్తించారా?
By: Tupaki Desk | 3 Jun 2021 12:35 PM GMTతెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ములుగు శాసనసభ్యురాలు.. కాంగ్రెస్ నేత సీతక్క కాస్త భిన్నమైన నేత అన్న విషయం తెలిసిందే. రోటీన్ రాజకీయాలకు భిన్నంగా ఆమె వ్యవహారశైలి ఉంటుంది. పేరుకు ఎమ్మెల్యే కానీ.. ఇంటి పక్కన పెద్దమ్మ మాదిరి ఆమె తీరు ఉంటుంది. అలాంటి ఆమె.. ఒక మహిళా డీసీపీపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
తన తల్లికి కరోనా సోకటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రికి చికిత్స చేయించుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఆమె ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆమెకు రక్తం ఇవ్వాల్సి వచ్చింది. దీంతో.. తమ కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరారని చెప్పారు.
అయితే.. ట్రాఫిక్ ను స్వయంగా పర్యవేక్షిస్తున్న డీసీపీ రక్షిత.. తమ బంధువుల కారును అరగంట పాటు ఆపేశారని చెప్పారు. తాము ఆసుపత్రి పని మీద వెళుతున్నామని.. ప్రయాణానికి అవసరమైన పాస్ ఉందని చూపించినా డీసీపీ రక్షిత మాత్రం వినిపించుకోలేదన్నారు. అంతేకాదు.. తాను వీడియో కాల్ చేసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తే.. డీసీపీ అందుబాటులోకి రాలేదన్నారు.
తమ వాళ్ల పట్ల ఆమె దూకుడుగా వ్యవహరించారని.. దాదాపు అరగంట పాటు కారును ఆపేశారన్నారు. చివరకు ఆమె వెళ్లిపోయిన తర్వాత.. మరో పోలీసు అధికారి కల్పించుకొని తమ బంధువుల కారును విడిచిపెట్టారని సీతక్క పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. అయినా పోలీస్ పాస్ వాహనానికి ఉండి.. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు విడిచి పెట్టాల్సిన వాహనాన్ని ఎందుకు అడ్డుకున్నారు? అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉదంతంపై ఇప్పటివరకు డీసీపీ రక్షిత స్పందించలేదు.