Begin typing your search above and press return to search.

విశాఖ జోన్ పై కేంద్రం మోసం చేసిందా ?

By:  Tupaki Desk   |   2 Feb 2021 5:38 AM GMT
విశాఖ జోన్ పై కేంద్రం మోసం చేసిందా ?
X
తాజా బడ్జెట్ తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2019 ఎన్నికల సందర్భంగా విశాఖపట్నంలో పర్యటించిన నరేంద్రమోడి మట్లాడుతు విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చేసినట్లే అనుకోమన్నారు. పాపం జనాలు కూడా అలాగే అనుకున్నారు. తీరా జరిగిందేమంటే విశాఖ రైల్వేను ముక్కలు ముక్కులుగా చేసేశారు. కోడికి ఈకలు పీకేసి రెక్కలు, కాళ్ళు నరికేసినట్లుగా వాల్తేర్ డివిజన్ను కూడా చీలికలు పీలికలు చేసేశారు.

విశాఖ రైల్వేజోన్ ఏర్పాటవుతుందని అనుకుంటే చివరకు డివిజన్ను కూడా ముక్కలు ముక్కలు చేసేసింది కేంద్రప్రభుత్వం. ఎన్నికల ముందు స్వయంగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి తర్వాత జరిగిన వాస్తవానికి ఏమాత్రం పొంతన కనబడలేదు. దాంతో జనాలు కేంద్రంపై మండిపోతున్నారు. తాజా బడ్జెట్లో అయినా వాల్తేర్ డివిజన్ కు ఏమన్నా నిధులిచ్చి ఆదుకుంటుందేమో అని అనుకున్నారు. అయితే పోయిన బడ్జెట్లో కేటాయించిన రూ. 2 కోట్లు కూడా తాజా బడ్జెట్లో కేటాయించలేదు.

విశాఖ రైల్వే జోన్ విషయాన్ని పక్కన పెట్టేస్తే తాజాగా కేంద్రం దృష్టి విశాఖ స్టీల్ ప్లాంట్ పైన పడిందట. స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయటానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఈ విషయమై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. దశాబ్దాలుగా స్టీలుప్లాంటుకు ప్రత్యేకంగా ఐరన్ మైన్స్ కేటాయించాలని మొత్తుకుంటున్నా పట్టించుకోని కేంద్రం ఇదే స్టీలు ప్లాంటును ప్రైవేటు పరం చేయటానికి ప్రయత్నాలు చేస్తోందంటూ నేతలు మండిపోతున్నారు. మరి చివరకు ఈ ప్రయత్నాలు ఏ మలుపులకు దారితీస్తుందో ఏమో.