Begin typing your search above and press return to search.

పెగాసస్ వంటి మరికొన్ని సాఫ్ట్ వేర్ లు కేంద్రం కొంటోందా?

By:  Tupaki Desk   |   2 April 2023 5:44 PM GMT
పెగాసస్ వంటి మరికొన్ని సాఫ్ట్ వేర్ లు కేంద్రం కొంటోందా?
X
కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే దేశంలోని ప్రతిపక్షాలు, మీడియా జర్నలిస్టులపై ఇజ్రాయిలీ తయారీ నిఘా సాప్ట్ వేర్ 'పెగాసస్'ను వినియోగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది మరిచిపోకముందే మరో సాఫ్ట్ వేర్ కొనడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెడీ అయ్యిందని కొన్ని జాతీయ మీడియాలు, టైమ్స్ లో కథనాలు వెల్లువెత్తాయి. వివాదాస్పద పెగాసస్ కంటే తక్కువ ప్రొఫైల్‌తో కొత్త స్పైవేర్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలని కేంద్రం చూస్తోందని.. కొత్త ఒప్పందాల కోసం $120 మిలియన్ల వరకు బడ్జెట్‌ను కేటాయించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.

ఈ నివేదిక ప్రకారం, పెగాసస్ కంటే తక్కువ బహిర్గతం కానీ స్పైవేర్ సిస్టమ్ కోసం అధికారులు వెతుకుతున్నారు, దీనిని ఇజ్రాయెల్ యొక్క ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసింది. కొంతమంది రాజకీయ నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు , జర్నలిస్టులు లక్ష్యంగా ఈ సాఫ్ట్ వేర్ ప్రయోగిస్తున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి.

ఈ నివేదికలపై ప్రభుత్వం ఖండించింది. కేవలం సంచలనాల కోసం కథనాలు రాశారని అని పేర్కొంది "భారత ప్రజాస్వామ్యాన్ని మరియు దాని సుస్థిరమైన సంస్థలను కించపరిచే ప్రయత్నం"గా అభివర్ణించింది.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని కూడా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం "అధునాతన దశల్లో" ఉన్న చర్చ, దాని జాతీయ భద్రతకు పెరుగుతున్న ముప్పుగా భావించే విషయాల్లో ఈ సాఫ్ట్ వేర్ ప్రయోగిస్తున్నారని.. $12-బిలియన్ డాలర్లు వెచ్చింది స్పైవేర్ ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు.

భారత అధికారులు పెగాసస్ ప్రత్యర్థుల శ్రేణిపై ప్రయోగిస్తున్నారని.., ఇందులో గ్రీస్ ప్రధాన కార్యాలయం ఇంటెలెక్సా అభివృద్ధి చేసిన ప్రిడేటర్ అనే వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఇజ్రాయెల్ సైనిక అనుభవజ్ఞులను ఉపయోగించిందని ఈ నివేదిక పేర్కొంది.

అమెరికా, యూకే , కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లోని ప్రభుత్వాలు స్పైవేర్ సామర్థ్యాలను ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్ల కంటే వారి స్వంత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అభివృద్ధి చేశాయని నివేదిక పేర్కొంది. పెగాసస్ లక్ష్యం మొబైల్ ఫోన్‌లో డేటా దొంగిలించడమే.. వాట్సాప్, మెసేజెస్, ఫేస్ బుక్, స్కైపీ, వైబర్ మరియు జీమెయిల్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల శ్రేణిలో చేసిన కమ్యూనికేషన్‌లను ఇది చోరీ చేసి ప్రభుత్వాలు నిఘా పెట్టేలా తయారు చేశాయి.

గత సంవత్సరం, సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ, నిఘా కోసం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను అనధికారికంగా ఉపయోగించారనే ఆరోపణలపై విచారణ జరిపింది, అది పరిశీలించిన ఫోన్‌లలో స్పైవేర్‌ను ఉపయోగించడంపై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్యానెల్‌కు సహకరించలేదు అని పేర్కొంది.

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వని వైష్ణవ్ , అంతకుముందు ఐటీశాఖ చూసిన రవిశంకర్ ప్రసాద్ పెగాసస్ వాడలేదని ఖండించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.